అమరావతి: కడపలో కొడుకుకు చికిత్స కోసం వచ్చిన మహిళను లైంగికంగా వేధించిన వైద్య సిబ్బబందిపై చర్యలు తీసుకోవాలని ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది.కడపలో రిమ్స్ ఆసుపత్రికి ఓ మహిళ తన కొడుకును చికిత్స కోసం తీసుకొచ్చింది. అయితే చికిత్స కోసం వచ్చిన మహిళ పట్ల ఆసుపత్రి సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

ఈ వేధింపుల విషయాన్ని ఏపీ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొంది.  లైంగిక వేధింపులకు పాల్పడిన  ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని  ఎస్పీ, జిల్లా వైద్యశాఖాధికారిని ఆదేశించింది మహిళా కమిషన్ చైర్మెన్.రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు పునరావృతంకాకుండా నిందితులపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఆదేశించింది.

రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా కమిషన్ చైర్ పర్సన్ ప్రకటించారు. లైంగిక వేధింపులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని ఆమె హెచ్చరించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు జరగకుండా ఉండేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుందని ఆమె గుర్తు చేశారు.