అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ శీతాకాల సమావేశాల వేదికగా టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మహిళలపై దాడులు తలచుకుంటే భయం వేస్తోందన్నారు. 

తెలుగుదేశం ప్రభుత్వం మహిళలను ఒక చులకనగా చూసిందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు విజయవాడ కేంద్రం 200 కుటుంబాలను కాల్ మనీ సెక్స్ రాకెట్ లో దించి వారి జీవితాల్లో చీకటి నింపారని ఆరోపించారు. 

చదవుల తల్లి రిషితేశ్వరిని అత్యంత దారుణంగా హత్య చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనేనని చెప్పుకొచ్చారు. ప్రసవవేదన అనుభవించి నవమోసాలు కష్టపడి కనిపెంచుతున్న మహిళలను నిర్ధాక్షిణ్యంగా అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగులబెడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. 

ఈరోజు దిశలాంటి ఘటన భవిష్యత్ లో పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం మహిళా బిల్లును తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంటే టీడీపీ నేతలు దాన్ని అడ్డుకోవడం చూస్తుంటే వారికి మనస్సాక్షి ఉందా అంటూ నిలదీశారు. అన్నం తింటున్నారా లేక గడ్డి తింటున్నారా అంటూ విరుచుకుపడ్డారు రోజా. 

బాహుబలి సినిమాలో సేనాధిపతి భార్యను మరో సేనాధిపతి టచ్ చేస్తూ ఆమె భుజంపై చేయి వేస్తే తలతీసిన దృశ్యం చూసి తాను ఎంతో సంతోషించానన్నారు. బాహుబలిలో ఆ సీన్ చూసిన ప్రతీ మహిళ ఉప్పొంగిపోయిందన్నారు. 

మహిళ గుండెల్లో చెలరేగే అగ్నిపర్వతం చల్లారడం తాను చూశానని చెప్పుకొచ్చారు. మహిళలపై దాడులు జరిగితే ఏం చేయలేని పరిస్థితుల్లో సినిమాలోనైనా న్యాయం జరిగిందని సంతోషడే స్థితికి మహిళ దిగజారిందని ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు.    

అసెంబ్లీలో ఉల్లి ఘాటు: స్పీకర్ కు ఉల్లిగిఫ్ట్ ప్యాక్ అందించిన టీడీపీ ఎమ్మెల్యే

దిశను హత్య చేసిన వారు ఎన్ కౌంటర్ అయ్యారని రోజా స్పష్టం చేశారు. అయితే నిర్భయ, రిషితేశ్వరిలపై దారుణాలకు ఒడిగట్టిన నిందితులకు ఎలాంటి శిక్షలు పడలేదన్నారు. గతంలో స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడికి పాల్పడిన వారు చచ్చారంటూ చెప్పుకొచ్చారు రోజా. 

ఇలాంటి కేసులన్నీ మీడియాలో హైలెట్ అయ్యాయని కానీ మీడియాకు దొరకని అనేక ఘోరాలు కూడా అనేకం జరిగాయని రోజా స్పష్టం చేశారు. అనేకమంది మహిళలు  అనేక అఘాయిత్యాలకు గురవుతున్నారని కానీ అవి వెలుగులోకి రావడం లేదన్నారు. 

ప్రస్తుత రోజుల్లో మహిళలపై దాడులు జరుగుతున్నప్పుడు గన్ వచ్చే లోపే జగన్ అన్న వచ్చి శిక్షిస్తాడన్న భరోసా మహిళలకు కల్పించడమే తమ లక్ష్యమని రోజా స్పష్టం చేశారు. ఆడపిల్లకళ్లలో కన్నీరు రప్పించే నిందితుడికి ఆ కన్నీరు ఆవిరయ్యేలోపు శిక్ష పడేలా ఈ సభద్వారా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని రోజా తెలిపారు. 

మహిళలు బ్రతికిబట్టకట్టగలగాలంటే సత్వరమే శిక్షలు పడాలని, బాధితురాలికి సత్వరమే న్యాయం జరగాలని రోజా డిమాండ్ చేశారు. ఆలస్యం అయితే న్యాయం కూడా ఆలస్యం అయిపోయే రోజు వస్తుందని రోజా అభిప్రాయపడ్డారు. 

చట్టం, న్యాయస్థానాలు ఉన్నా అవి వేగంగా పనిచేయకపోవడంతో నిందితులు తప్పించుకుంటున్నారని తెలిపారు. మహిళలపై దాడులు జరుగుతున్నా వెంటనే శిక్షలు పడకపోవడం వల్ల సత్వరమే న్యాయం జరగకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతమవుతాయన్నారు. 

మగవాడి వెన్నెలో వణుకు పుట్టేలా చట్టాలు తీసుకువస్తే ఆడవారిపై చెయ్యివేసేందుకు భయపడతారని తెలిపారు. ఉన్నావ్ ఘటన చాలా దారుణమని చెప్పుకొచ్చారు. ఉన్నావ్ బాధితురాలు న్యాయం కోసం పోరాటం చేస్తే ఆమెను హత్య చేసిన దాఖలాలు ఉన్నాయన్నారు. అందువల్లే మహిళలపై దాడులకు తక్షణమే న్యాయం జరగాలని కోరారు. 

లోకేష్ పప్పులో ఉల్లి లేదనే చంద్రబాబు బాధ: బాలకృష్ణపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే రోజా