Asianet News TeluguAsianet News Telugu

మందకోడిగా రుతుపవనాల కదలిక... రాగల మూడురోజులు ఇదీ ఏపీలో వాతావరణ పరిస్థితి

ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో నేటి(శుక్రవారం) నుంచి రాగల మూడురోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.  

AP Weather Report... rains in further three days akp
Author
Amaravati, First Published Jun 25, 2021, 12:50 PM IST

అమరావతి:  ఝార్ఖండ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్ వరకు 1.5 కిమీల ఎత్తు వరకు ఉపరితల ద్రోణిగా ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో నేటి(శుక్రవారం) నుంచి రాగల మూడురోజుల పాటు వర్షాలు కురవనున్నాయని తెలిపారు. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర,యానాం, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశముందని ప్రకటించారు. 

రేపటి నుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించక నైరుతి రుతుపవనాల కదలిక మందకొడిగా సాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios