అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగాల నియామకాలు తమకు సంబంధం లేదని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ స్పష్టం చేశారు. పరీక్షా పేపర్ లీకైనట్లు వస్తున్న ఆరోపణలకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. 

ఏపీపీఎస్సీ రాజ్యంగబద్ద సంస్థఅని తెలిపారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకాల బాధ్యతను ప్రభుత్వం తమకు అప్పగించలేదని స్పష్టం చేశారు. 
సచివాలయ ఉద్యోగ నియామకాల పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించలేదని చెప్పుకొచ్చారు. 

సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియతో తమకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఆరోపణలపై సంబంధిత ప్రభుత్వ శాఖలే వివరణ ఇవ్వాలని సూచించారు. పేపర్లు లీకైన వ్యవహారం తమకు తెలియదని లీక్ అయ్యిందో లేదో అనేది పరీక్షలు నిర్వహించిన పంచాయితీరాజ్ శాఖే వివరణ ఇవ్వాలని సూచించారు. 

ప్రశ్నాపత్రం లీకైనట్లు వస్తున్న వార్తలకు తాము వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తప్పు జరిగిందా లేదా అనేది తమకు సంభందం లేదని స్పష్టం చేశారు. పరీక్షలకు సంభందించిన కాన్ఫిడెన్షియల్ పక్రియను తాము నిర్వహించలేదన్నారు. గోప్యంగా చేయాల్సిన పనులను సంబందిత ప్రభుత్వ శాఖలే చేసాయని ఏపీపీ ఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

ప్రశ్నపత్రాల లీకేజీ ఓ భారీ స్కామ్: జగన్ సర్కార్ పై చంద్రబాబు ఫైర్