నిరుద్యోగులకు శుభవార్త...టీచర్ల భర్తీకి మరో నోటిఫికేషన్

AP Urdu Teachers Recruitment 2018 Notification
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ రిక్రూట్ మెంట్ కేవలం ప్రభుత్వ ఉర్ధూ మీడియం పాఠశాలల టీచర్ల భర్తీకి సంబంధించింది. రాష్ట్రంలోని ఉర్ధూ మాధ్యమ స్కూళ్లల్లో 211 ఎస్జీటీ టీచర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను కూడా రాష్ట్ర విద్యా శాఖ అధికారులు విడుదల చేశారు.

వచ్చే నెల ఆగస్ట్ 4వ తేదీ నుండి దరఖాస్తుల స్వీకరన ప్రారంభమవుతుందని ఏపి పాఠశాల విద్యా కమీషనర్ సంధ్యారాణి తెలిపారు. ఆగస్ట్ 14వ తేదీ వరకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. అనంతరం సెప్టెంబర్ 16న రాత పరీక్ష నిర్వహించి అదే నెల 23న ఫలితాలు వెల్లడిస్తామని ఆమె ప్రకటించారు.

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒక సారి భారీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి టీచర్ల భర్తీ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే మరోసారి భారీ ఎత్తున టీచర్ల భర్తీ చేపట్టాలని భావించిన సర్కార్... డీఎస్సీ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికి చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ సమయంలో ఈ నోటిఫికేషన్ ఉర్దూ మాధ్యమంలో టీచర్  పోస్టుల  కోసం    ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఊరట కల్గించనుంది.

loader