Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు కూతుళ్లు లేకనే ఈ కష్టాలా!

"కూతురు పోయిన అవేదన ముఖ్యమంత్రి చంద్రబాబు కు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన కు కూతుళ్లు లేరు"

Ap tops in students suicides

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రికార్డులొచ్చాయట.

అఘాయిత్యాలు, అరాచకాలు, ఆత్మహత్యలలో  కొత్త రాష్ట్రానికి రికార్డు లొస్తున్నాయని  వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్ కె రోజా వ్యాఖ్యానించారు.

 

ఈ మూడింటిలో కూడా నెంబర్ వన్ గా ఉండటం మీద  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమి చెబుతారని ఆమె ప్రశ్నించారు. అయితే, చంద్రబాబుకు కూతుళ్లు లేరని, అందువల్ల కూతురు పోయిన బాధ ఆయన అర్థంకాదు.  అందుకే  విద్యార్థినుల ఆత్మహత్యల సమస్యమీద సీరియస్ చర్యలు లేవని ఆమె అగ్రహించారు.

 

 ’విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు. నంద్యాల ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఉషారాణి చనిపోయి ఒకరోజు గడవక ముందే మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.విద్యార్థుల పెద్ద ఎత్తున ఆత్మహత్య లు పాల్పడుతూ ఉంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం విచారకరం,’ అని ఆమె అన్నారు.

 

’అన్నింటిలోనూ నెంబర్‌ వన్‌‑గా ఉండాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. బాగుంది. అరచకాలు, ఆత్మహత్యలల్లో కూడా ఏపీ నెంబర్‌-వన్ గా మారుతూ ఉంది. దీనికి ఆయన సమాధానం చెప్పాలి,’ అని ఆమె చెప్పారు.


 విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం వేసిన కమిటీ ఏమైందని రోజా  ప్రశ్నించారు.   ఈ కమిటీ నివేదికను తొక్కి పట్టి  కార్పొరేట్ కాలేజీలకు రక్షణ కల్పించి ప్రోత్సహిస్తున్నారని ఆమె ారోపించారు.

విద్యార్థుల  ఆత్మహత్యలలో ఎక్కవ జరిగేవి నారాయణ కాలేజీలలో నే అయినా  ఈసంస్థల వోనరు ఇంకా క్యాబినెట్ లో కొనసాగడం పట్ల ఆమె విస్మయం వ్యక్తం చేశారు.

 

 ’కార్పొరేట్‌ విద్యాసంస్థల ఆరాచకాలను ప్రభుత్వం ఎందుకు అరికట్టడం లేక పోతున్నది. చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టే ఆ విలువ, కూతురు పోయిన అవేదన తెలియదు,’ అంటూ మహిళల కన్నీటిలో చంద్రబాబు ప్రభుత్వం కొట్టుకుపోతుందని అని శాపమిచ్చారు.

 

ఉషారాణి ఆత్మహత్యలపై స్పందించాల్సిన విద్యశాఖ్ మంత్రి గంటా శ్రీనివాసరావు విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రేమో బికినీ ఫెస్టివల్, బీచ్  ఫెస్టివల్ ఏర్పాట్లలో బిజీతా ఉన్నారని అన్నారు. గంటాను వెంటనే కేబినెట్‌ నుంచి తొలగించడమే కాకుండా, ఇంతవరకు  ఆత్మహత్యల మీద, ర్యాగింగ్ మీద, విద్యార్థినుల వేధింపుల మీద వేసిన కమిటీల నివేదిక లన్నింటిని వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios