ప్రపంచ స్థాయి అమరాతికి అంతే స్థాయి సెంట్రల్ వాటర్ ఫ్రంట్ పార్క్ హంగు కల్పించేందుకు నమూనా కోసం ప్రపంచమంతా వెదకాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను పురమ ాయించారు
మేటి అమరావతికి సాటి అయిన జలాశయం కావాలని రాజావారు కోరుకుంటున్నారు. అమరావతిలో ఒక సెంట్రల్ పార్క్ ఉండాలి,అది కూడా జలాయం పక్కనే అండాలనేది రాజవారి అలోచన.
అమరావతి వర్ ల్డ్ క్లాస్ క్యాపిటల్ కాబట్టి ప్రపంచంలోనే అందమయిన వాటర్ ఫ్రంట్ పార్క్ నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను అదేశించారు. అంతే కాదు, ప్రపంచంలో పెద్ద నగరాలలో ఉన్న తటాకాలన్నింటిని స్టడీ చేసి రావాలని కూడా ఆయన అధికారులను అదేశించారు. ఇదే తిరకాసు.
నది పక్క రాజధాని ఉండాలని (కెసిఆర్ చెప్పినప్పటి నుంచి ), ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, ఖండాలన్నింటిని గాలించి వచ్చారు. రాజధాని అధ్యయనాలు ఇంకా సాగుతూ నే ఉన్నాయి. గతంలో రాజధాని ప్రాంత అభివృధ్ది సంస్థ (సిఆర్ డి ఎ) అధికారి శ్రీకాంత్ ప్రపంచమంతా తిరిగొచ్చారు. ఆ విజ్ఞానాన్ని ఆయన రాజధానికి పులమక ముందే ఆయన్ని తప్పించి అమరావతి తో సంబంధమేలేని ఒక మూలన కూర్చో బెట్టారు.
తర్వాత శ్రీధర్ అనే అధికారి వచ్చారు. ఆయన ఒక దఫా ప్రపంచయాత్ర చేసి రాజధానులను అధ్యయంన చేసి వచ్చారు. ఆ తర్వాత రాజధానిలో రోడ్లెలా ఉండాలి, రోడ్లకు అప్పిచ్చు వారెవరు, రాజధానిలో పెట్టుబడులు పెట్టేదెవరు అనేవాటిని తెలుసుకునేందుకు మరో ధఫా ఈ బృందాలన్నీ నేల నాలుగు చెరగులా గాలిస్తున్నాయి. ఈ గాలింపు ఇంకా పూర్త వలేదు. ఈ మధ్యలో, ఎర్రచందనం అమ్మితే రాజధానికయ్యే ఖర్చు ఎల్లుతుందేమోననే విషయం కనుగొనేందుకు మరొక బృందం విదేశాలలో తిరిగి వచ్చింది.
ఇలా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక అధికార బృందం ఏదో ఒక ఖండంలో ఏదో ఒక దేశంలో ప్రతిరోజూ తిరుగుతూ ఉంటుంది.
ఇపుడు తాజాగా ఇంకో దఫా విదేశాలు తిరిగివచ్చేందుకు ముఖ్యమంత్రి మంచి అవకాశం కల్పిస్తున్నారు. ఈసారి ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, విదేశాలలో వుండే చెరువులు, రిజర్వాయర్లు తనిఖీ చేసి వచ్చి, అమరావతి కూడా అచ్చు విదేశీ రాజధాని అనిపించేలా నిర్మించేందుకు పూనుకుంటున్నారు.
ఈ కొత్త జలాశయం వచ్చే జూన్ నాటికి పూర్తి కావాలని కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
’ప్రపంచంలో బెస్ట్ వాటర్ ఫ్రంట్ పార్క్ ఎక్కడో ఉందో వెదకండి, పరిశీలించండి, వాటిలో నుంచి ఒక బెస్ట్ పార్క్ ను ఎంపిక చేసి అట్లాంటిది అమరావతిలో నిర్మించండి,’ అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
నీరుకొండ నుంచి ఉండవల్లికి వెళ్లే మార్గంలో ఉన్న ఈ వాటర్ ఫ్రంట్ పార్క్ ను 24కి.మీ కొండవీటి వాగు పొడవునా ఏర్పాటు చేయాలని, వెంటనే పనులు ప్రారంభించాలని కూడా ఆయన ఆదేశించారు.
97 ఎకరాలున్న శాఖమూరు రిజర్వాయర్ ను ఇలా మారుస్తారు. దీనికితోడుగా అక్కడ ప్రపంచ స్థాయి ఉద్యానవనం కూడా నిర్మిస్తారు. చెట్లెలా పెంచాలి, ఏ మొక్కలు పెంచాలనే దానికోసం పక్కనే కడియంనర్సరీ వారిని సంప్రదించండి కూడా ఆయన అధికారులకు సూచించారు.
రాజధాని అమరావతి నగరానికి అలంకారంగా నిలిచేలా శాఖమూరు రిజర్వాయర్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టి వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు.
