Asianet News TeluguAsianet News Telugu

వెనక్కి తగ్గిన ఏపీ.. తెలంగాణ డిమాండ్లకు ఓకే.: రేపటితో ఆర్టీసీ వివాదానికి తెర

గత కొద్దినెలలుగా ఏపీ- తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్టీసీ వివాదానికి రేపటితో ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సోమవారం ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలపై ఒప్పందం కుదరనుంది.

ap telangana rtc bus dispute update
Author
Amaravathi, First Published Nov 1, 2020, 7:40 PM IST

గత కొద్దినెలలుగా ఏపీ- తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్టీసీ వివాదానికి రేపటితో ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సోమవారం ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలపై ఒప్పందం కుదరనుంది.

దీనిలో భాగంగా రేపు హైదరాబాద్‌ బస్‌భవన్‌లో ఇరు రాష్ట్రాల రవాణా, ఆర్టీసీ అధికారులు భేటీ కానున్నారు. తెలంగాణ చెప్పిన విధంగా బస్సులు తిప్పేందుకు ఏపీ అంగీకారం తెలిపింది.

దీంతో 1.61 లక్షల కిలోమీటర్లకే ఏపీ పరిమితం కానుంది. రూట్లలోనూ తెలంగాణ ప్రతిపాదనకే ఆంధ్రప్రదేశ్ ఓకే చెప్పింది. కీలకమైన విజయవాడ- హైదరాబాద్ రూట్‌లో ఏపీఎస్ఆర్టీసీ కంటే ఎక్కువ సర్వీసులు తప్పనుంది టీఎస్ఆర్టీసీ.

ఏపీలోని మిగిలిన రూట్లలోనూ బస్సులు నడిపేందుకు తెలంగాణ అంగీకరించిందని ఏపీ రవాణా అధికారులు చెబుతున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. తెలంగాణ ప్రతిపాదనలను అంగీకరించామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

మరోవైపు రేపు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. భేటీ తర్వాత అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు.

కోవిడ్ 19 లాక్ డౌన్ కారణంగా రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. అయితే అన్‌లాక్ సడలింపుల్లో భాగంగా అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఎత్తివేసినా రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిరగడం లేదు.
 

 

Follow Us:
Download App:
  • android
  • ios