Asianet News TeluguAsianet News Telugu

పోలీసుల ముసుగులో సంఘవిద్రోహశక్తులు... అమరావతి పాదయాత్రపై భారీ కుట్ర: అచ్చెన్న సంచలనం

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్రను విధ్వంసం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

AP TDP Chief Atchannaidu Sensational Comments on Amaravati Farmers Padayatra
Author
Amaravati, First Published Nov 11, 2021, 3:59 PM IST

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు దాదాపు రెండేళ్లుగా ఆందోళన చేస్తున్నారు. అయితే ఇటీవల న్యాయస్థానం టు దేవస్థానం పేరిట అమరావతి జేఏసి ఆధ్వర్యంలో రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర ప్రకాశం జిల్లాలో ఉద్రిక్తతంగా మారింది. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో పాదయాత్రలో ఇతరులను పాల్గొననివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగి లాఠీచార్జ్ కు దారితీసింది. ఈ ఘటనపై ఏపి టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. 

amaravati farmers maha padayatra కు సంఘీభావంగా తెలియజేయడానికి వచ్చినవారిపై పోలీసులు తమ ప్రతాపం చూపించడం దారుణమన్నారు atchannnaidu. అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు వస్తున్న స్పందన చూసి cm jagan reddy కి చలిజర్వం పట్టుకుందని ఎద్దేవా చేసారు. అందుకే పోలీసులను అడ్డం పెట్టుకుని పాదయాత్రను అడ్డుకుంటున్నారని అచ్చెన్న అన్నారు. 

''అమరావతి మహా పాదయాత్ర రాజకీయ యాత్రకాదు... భావితరాల భవిష్యత్ యాత్ర. అలాంటి ఈ పాదయాత్రను MLC Election పేరిట ఎన్నికల కోడ్ ఆపాదించి అడ్డుకోవడం న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించడమే. అన్నిపార్టీలు, సర్వమతాల సమ్మేళనంతో రైతులు భాగస్వామ్యమై యాత్రను సాగిస్తున్నారు'' అని అచ్చెన్న పేర్కొన్నారు.

read more  Amaravati Padayatra: పోలీసులు లారీచార్జ్‌లో విరిగిన రైతు చేయి.. వర్షంలోనూ కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర

''జగన్ రెడ్డి చేసిన మోసానికి  YSRCP కి చెందిన రైతులు కూడా బోరుమంటున్నారు. ప్రజలను భయపెట్టి, బారీకేడ్లు పెట్టి పాదయాత్రలో పాల్గొనకుండా చేస్తున్నారు.పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మద్ధతు తెలపుతుండటంతో యాత్రను అడ్డుకోవాలని వైసీపీ కుట్ర చేస్తోంది'' అని అచ్చెన్న ఆరోపించారు. 

''అమరావతి కోసం సాగుతున్న పాదయాత్రను ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. దీన్ని మిగతా ప్రజలకు చూపిస్తున్న మీడియాపై పోలీసులు అహం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు'' అని AP TDP అధ్యక్షులు హెచ్చరించారు. 

''తాడేపల్లి ఆదేశానుసారమే అమరావతి రైతుల పాదాయత్రను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. అధికార దాహంతో జగన్ పాదయాత్ర చేస్తే రాష్ట్రం కోసం రైతులు పాదయాత్ర చేస్తున్నారు. జగన్ రెడ్డిది స్వార్థ పాదయాత్ర అయితే రైతులది నిస్వార్థ పాదయాత్ర. పోలీసుల డ్రస్ లతో సంఘవిద్రోహశక్తులను పంపి విధ్వంసం చేయాలని చూస్తున్నారు'' అని ఆరోపించారు. 

read more Amaravati Maha Padayatra: అమరావతి రైతులపై పోలీసుల లాఠీచార్జ్... లోకేష్ సీరియస్

''దుర్మార్గపు ఆలోచనలను ప్రభుత్వం మానుకోవాలి. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తే రైతులు ఉద్యమం ఆపుతారు. అమరావతిని నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. రాజధాని మార్పుపై ఇచ్చిన మాటను తప్పినందుకు జగన్ సహా వైసీపీ నేతలందరూ సిగ్గుతో తలదించుకోవాలి. మూడు ముక్కల పేరుతో జనాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. రాజధానిపై వైసీపీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమయ్యాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చకుని అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించి ప్రజల భవిష్యత్తును కాపాడండి'' అని అచ్చెన్నాయుడు వైసిపి ప్రభుత్వాన్ని కోరారు.

ఇవాళ ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద పాదయాత్రగా వస్తున్న రాజధాని రైతులకు స్వాగతం పలికేందుకు స్థానికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, స్థానికులకు మధ్య తోపులాటచోటుచేసుకుంది. పోలీసులు అడ్డుగా పెట్టిన తాళ్లను దాటుకుని ముందుకురావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసారు. దీంతో పలువురు రైతులకు గాయాలయ్యయి. ఇద్దరు రైతులకు చేయి విరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా సీరియస్ అయ్యారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios