ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థి ఒకరు ఢిల్లీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఏపీకి చెందిన నల్లి హేమంత్ కుమార్ ఢిల్లీలోని ఓ విద్యాసంస్థలో చదువుతున్నాడు. ఈ క్రమంలో అతను ఆదివారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అతని వద్ద నుంచి రైల్వే పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఫీజు కోసం కాలేజీ యాజమాన్యంతో పాటు లెక్చరర్ల వేధింపులు తాళలేక తాను ఆత్మహత్యకు పాల్పడుడుతున్నట్లు హేమంత్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.