Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో ‘‘మా’’ బిల్డింగ్ కట్టండి.. లేదంటే షూటింగ్‌లు జరపనివ్వం: సినీ పెద్దలకు విద్యార్ధి సంఘాల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో మా కార్యాలయం (maa Office), ఫిలిం సిటీ (film city), ఫిలిం స్టూడియోలను ఏర్పాటు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ యువజన విద్యార్ధి సంఘాల జేఏసీ చైర్మన్ డి వి కృష్ణ డిమాండ్ చేశారు. అలాగే చిత్రపరిశ్రమని రాయలసీమ, ఉత్తరాంధ్రకు తరలించాలని ఆయన కోరారు.

ap studens jac demands maa building in andhra pradesh
Author
Vijayawada, First Published Oct 9, 2021, 3:42 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో మా కార్యాలయం (maa Office), ఫిలిం సిటీ (film city), ఫిలిం స్టూడియోలను ఏర్పాటు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ యువజన విద్యార్ధి సంఘాల జేఏసీ చైర్మన్ డి వి కృష్ణ డిమాండ్ చేశారు. అలాగే చిత్రపరిశ్రమని రాయలసీమ, ఉత్తరాంధ్రకు తరలించాలని ఆయన కోరారు. ఏపీ విభజన చట్టంలోని హామీల సాధన కోసం చిత్ర పరిశ్రమ, యువజన, విద్యార్థి సంఘాలతో కలిసి ముందుకు రావాలి అని కోరారు. టాలీవుడ్ (tollywood) రెండు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయాల్సింది పోయి కేవలం హైదరాబాద్ (hyderabad), తెలంగాణ అభివృద్ధికి మాత్రమే కృషి చేస్తోందని కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

ALso Read:విష్ణు కూడా మీ కుటుంబ సభ్యుడే.. మనస్సాక్షితో ఆలోచించి ఓటేయ్యండి: ‘‘మా’’ సభ్యులకు మోహన్ బాబు పిలుపు

తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సినిమా థియేటర్లు, జనాభా ఎక్కువ ఉందని ఆంధ్రప్రదేశ్ నుంచే టాలీవుడ్ కు అధిక ఆదాయం వస్తుందని ఆయన చెప్పారు. అలాగే హీరోలు, హీరోయిన్లు ఆర్టిస్టులు ఏపీ వారే ఎక్కువ ఉన్నారని కృష్ణ వెల్లడించారు. సొంత ప్రాంతాలను అభివృద్ధి చేయకుండా... హైదరాబాద్‌ని అభివృద్ధి చేయడం సొంత ప్రాంతానికి అన్యాయం చేయడమేనని కృష్ణ దుయ్యబట్టారు. రాయలసీమ (rayalaseema) లోని కథలు యాస, భాష, ఫ్యాక్షన్ పేరుతో సినిమాలు తీసి వేల కోట్లు సంపాదిస్తూ పుట్టిన గడ్డకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు సినీ పరిశ్రమ వచ్చే విధంగా కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏపీలో మా అసోసియేషన్ బిల్డింగ్, స్టూడియోలు, ఫిలింసిటీ నిర్మించకపోతే హీరోలు, దర్శకనిర్మాతల ఇల్లు ముట్టడిస్తామని కృష్ణ హెచ్చరించారు. అలాగే ఏపీలో ఎలాంటి సినిమా షూటింగులు చేయకుండా అడ్డుకుంటామన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios