ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. కరోనా కారణంగా ప్రభుత్వం పదో తగరతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్‌లు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. కరోనా కారణంగా ప్రభుత్వం పదో తగరతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్‌లు ప్రకటించారు. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విజయవాడలో ప్రకటించారు. పరీక్షలు రద్దైన నేపథ్యంలో పరీక్షా ఫలితాలను నిర్ణయించడానికి ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది.

కమిటీ సిఫార్సులకు అనుగుణంగా విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించారు. ఇంటర్నల్‌గా 50 మార్కుల చొప్పున నిర్వహించిన 3 ఫార్మేటివ్ అసెస్‌మెంట్ల ఆధారంగా ఈ గ్రేడ్లు ప్రకటించారు. ఈ ఏడాది పదో తరగతి కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,38,000 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో ఓపెన్‌ స్కూల్‌ అభ్యర్థులను సైతం ప్రభుత్వం పాస్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా దరఖాస్తు చేసుకున్న వారందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.