Asianet News TeluguAsianet News Telugu

ఏపీ భవన్ లో తమ్మినేని సీతారాంకు అవమానం: భార్య ఆవేదన

ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు అవమానం జరిగింది. రాష్ట్ర అతిథిగా పరిగణించకుండా బిల్లులు చెల్లించాలంటూ ఏపీ భవన్ ఉద్యోగులు కోరారు. దానిపై తమ్మినేని సీతారాం సతీమణి కూడా ఆవేదన వ్యక్తం చేశారు.

AP speaker Tammineni Seetharam insulted at AP Bhavan
Author
New Delhi, First Published Dec 23, 2019, 10:35 AM IST

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఢిల్లీలో ఏపీ భవన్ లో చేదు అనుభవం ఎదురైంది. ప్రొటోకాల్ నిబంధనలను పాటించకుండా రాష్ట్ర అతిథిగా తన గౌరవ మర్యాదలకు తిలోదకాలు ఇచ్చారి ఆయన మనస్తాపానికి గురయ్యారు. 

డెహ్రాడూన్ నుంచి తమ్మినేని శనివారం సాయంత్రం ఢిల్లీలోని ఏపీ భవన్ కు సతీసమేతంగా చేరుకున్నారు. ఆయన స్వర్ణముఖి బ్లాకులోని 320 గదిని కేటాయించారు. ఆదివారం సాయంత్రం ఆయన రాష్ట్రానికి వెళ్లే హడావిడిలో ఉండగా ఏపీ భవన్ ఉద్యోగి ఒకతను వచ్చి భోజన, వసతి బిల్లులు చెల్లించాలని, పుస్తకంపై సంతకం చేయాలని కోరాడు. 

 Also Read: అరగుండు...అరమీసంతో...నేను రైతును...

రాష్ట్ర అతిథి హోదాలో ఉన్న తనను బిల్లులు అడగడమేమిటని ఆయన ఆశ్చర్యపోయారు. మీకు కెటగిరీ -1 కింద విడిది ఇచ్చారని, అమరావతిలో ఉండే సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) కనుంచి రాష్ట్ర్ అతిథిగా కాకుండా కేటగిరీ-1లో మీకు వసతి ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చారని అతను చెప్పాడు. దాని వల్ల ఈ పొరపాటు జరిగిందని చెప్పాడు. 

దాంతో తీవ్ర ఆవేదనకు గురైన సీతారాం ముందు బిల్లు చెల్లించాలని, ఆ తర్వాత తాను చూసుకుంటానని తన ఆంతరంగిక సిబ్బందికి చెప్పారు. దాంతో ఆయన సతీమణిి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు ఎంతైనా ముందు ఇచ్చేద్దామని, మనకు అవమానం జరిగిందని, స్పీకర్ గా ఈ అధికారులు గౌరవించలేదని ఆమె అన్నారు. 

స్పీకర్ తమకు స్టేట్ గెస్ట్ అని, ఆయన విడిది ఉన్నందుకు బిల్లు వసూలు చేయాలని అనుకోవడం తప్పేనని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios