Asianet News TeluguAsianet News Telugu

జగన్ రాలేదనే అసంతృప్తి నాకు ఉంది.. కోడెల

త్వరలో ఏపీలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఈ సారి కూడా తాను ప్రతిపక్ష నేత జగన్ ని ఆహ్వానిస్తానని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు.  

ap speaker kodela shivaprasada rao says he will invite jagan to assembly sessions
Author
Hyderabad, First Published Jan 29, 2019, 4:37 PM IST

త్వరలో ఏపీలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఈ సారి కూడా తాను ప్రతిపక్ష నేత జగన్ ని ఆహ్వానిస్తానని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు.  ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుంటే తాము అసెంబ్లీలో అడుగుపెట్టమని వైసీపీ నేతలు మొరాయించిన సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరంగా ఉంది. స్వయంగా కోడెల ఆహ్వానించినప్పటికీ.. జగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు.

ఇదిలా ఉండగా.. మరి కొద్ది రోజుల్లో ఏపీలో మరోసారి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై కోడెల మాట్లాడారు. జగన్ ని కలిసి.. సమావేశాలకు రావాల్సిందిగా కోరదామంటే.. తనకు అసలు మాట్లాడటానికి కూడా ఆయన అవకాశం ఇవ్వడం లేదని కోడెల చెప్పారు.

సభలో ప్రతిపక్ష నేత లేడనే అసంతృప్తి తనకు ఉందన్నారు. ఇరు పక్షాలు సభలో ఉంటేనే తనకు సవాల్ గా ఉ:టుందన్నారు. అలాంటప్పుడు నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కేంద్రం ఓటాన్ అకౌంట్ కి బదులు పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. అది పూర్తిగా అనైతికమని.. రాజ్యాంగ విరుద్ధమని ఆయన చెప్పారు.

 

asianet news special

షార్ట్ ఫిలిమ్స్ చేసి కష్టపడి పైకొచ్చిన తెలుగు యువ దర్శకులు!

Follow Us:
Download App:
  • android
  • ios