ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి బెయిల్ మంజూరు కావడం పట్ల మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. వచ్చింది బెయిలే అని, నిర్దోషి అని తీర్పు కాదని ఆయన పేర్కొన్నారు.

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ లభించింది. దీనిపై టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. అధికార వైసీపీ నాయకులు కూడా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి కూడా స్పందించారు. చంద్రబాబు నాయుడికి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ మాత్రమే వచ్చిందని అన్నారు. ఆయన నిర్దోషిగా విడుదల కాలేదని చెప్పారు.

Shanti Dhariwal : మాకు డబ్బులొద్దు.. న్యాయం, గౌరవం కావాలి.. శాంతి ధరివాల్ కు మహిళల నుంచి వ్యతిరేకత

కానీ కొందరు రెచ్చిపోయి ప్రభుత్వాన్ని, సీఎంను దూషిస్తున్నారని అన్నారు. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అంబటి రాంబాబు అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. అందులో ‘‘వచ్చింది బెయిలే... నిర్దోషి అని తీర్పు కాదు రెచ్చిపోయి ప్రభుత్వాన్నీ , ముఖ్యమంత్రి ని దూషిస్తున్నారు.. మూల్యం చెల్లిస్తారు !’’ అని తెలిపారు.

వేములవాడలో గాలి దుమారం బీభత్సం.. కూలిన బీఎస్పీ ప్రజా ఆశీర్వాద సభా ప్రాంగణం, టెంట్లు.. 15 మందికి గాయాలు..

ఇదిలా ఉండగా.. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేస్తూ మంజూరు చేసింది. ఈ నెల 28వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ తీర్పునకు సంబంధించిన షరతులు వర్తిస్తాయని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నెల 28వ తేదీన చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని హైకోర్టు సూచించింది. మరో వైపు ఈ నెల 29 నుండి రాజకీయ ర్యాలీలు, సభల్లో చంద్రబాబు పాల్గొనవచ్చని హైకోర్టు తెలిపింది.

Nara lokesh : స‌త్యమే గెలిచింది.. ఇక అస‌త్యంపై యుద్ధం ప్రారంభం - నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబునాయుడిని ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో చంద్రబాబుకు ఆరోగ్య కారణాలతో ఈ ఏడాది అక్టోబర్ 31న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. అయితే రెగ్యులర్ బెయిల్ పై చంద్రబాబు తరపు న్యాయవాదులు, ఆంధ్రప్రదేశ్ సీఐడీ తరపు న్యాయవాదుల వాదనలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విన్నది. ఈ నెల 16వ తేదీన ఇరువర్గాలు తమ వాదనలను పూర్తి చేశారు.ఈ విషయమై తీర్పును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారంనాడు వెల్లడించింది. చంద్రబాబునాయుడు ఆరోగ్య పరీక్షలు, చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని ఏపీ హైకోర్టు సూచించింది. అంతేకాదు ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు హాజరు కావాలని కూడ హైకోర్టు ఆదేశించింది.