Nara Lokesh : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి బెయిల్ రావడం పట్ల ఆయన తనయుడు నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. సత్యమే గెలిచిందని చెప్పారు. ఇక నుంచి అసత్యంపై యుద్దం ప్రారంభమవుతుందని తెలిపారు.
Nara lokesh : టీడీజీ జాతీయాధక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ రావడం పట్ల ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో సత్యమే గెలిచిందని, ఇక అసత్యంపై యుద్ధం ప్రారంభమవబోతోందని చెప్పారు.
Shanti Dhariwal : మాకు డబ్బులొద్దు.. న్యాయం, గౌరవం కావాలి.. శాంతి ధరివాల్ కు మహిళల నుంచి వ్యతిరేకత
సత్యమేవజయతే మరోసారి నిరూపితమైందని నారా లోకేష్ తెలిపారు. ఆలస్యమైనా సత్యమే గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ కనుసన్నల్లో వ్యవస్థల మేనేజ్మెంట్ పై సత్యం గెలిపించిందని పునరుద్ఘాటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం మరోసారి తల ఎత్తుకుని నిలబడిందని చెప్పారు. తాను ఎప్పుడూ తప్పు చేయబోను, చేయనివ్వబోనని చంద్రబాబు ఎప్పుడూ చెప్పేవారని, అదే ఇప్పుడు మరో సారి నిరూపితమైందని అన్నారు.
Maharashtra Earthquake : మహారాష్ట్రలోని హింగోలిలో భూకంపం.. తెలంగాణ, కర్ణాటకలోనూ ప్రకంపనలు..
మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసు జగన్ కోసమని, ఆయన వ్యవస్థల ద్వారా బనాయించిందని బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా తెలుస్తోందని నారా లోకేష్ అన్నారు. అరెస్టు చేసి 50 రోజులకి పైగా జైలులో పెట్టారని, కానీ ఒక్క ఆధారం కూడా కోర్టు ఎదుట ఉంచలేకపోయారని, అందుకే తప్పుడు కుట్రలన్నీ న్యాయం ముందు బద్దలయ్యాయని తెలిపారు.
అసలు షెల్ కంపెనీలే లేవని స్పష్టం అయ్యిందని అన్నారు. టీడీపీ బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు జమ అయ్యాయని చేసిన ఆరోపణ పచ్చి అపద్దమని తేలిపోయిందని అన్నారు. తన తండ్రికి రూపాయి కూడా రాని స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చారనేది అవాస్తవమని హైకోర్టు స్పష్టం చేసిందని నారా లోకేష్ అన్నారు.
