మరో అధికారిపై వేటేసిన నిమ్మగడ్డ: ఎన్నికల సంఘం సెక్రటరీగా వాణీ మోహన్‌ తొలగింపు

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం సెక్రటరీగా వాణీ మోహన్ ను తొలగిస్తూ ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకొన్నారు. సోమవారం నాడు ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్ పై వేటేసిన మరునాడే వాణీ మోహన్ పై కూడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేటేయడం చర్చకు దారి తీస్తోంది.
 
AP SEC removed Election commission secretary Vani mohan lns

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం సెక్రటరీగా వాణీ మోహన్ ను తొలగిస్తూ ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకొన్నారు. సోమవారం నాడు ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్ పై వేటేసిన మరునాడే వాణీ మోహన్ పై కూడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేటేయడం చర్చకు దారి తీస్తోంది.

also read:స్థానిక ఎన్నికల 'పంచాయితీ': గవర్నర్‌తో నిమ్మగడ్డ రమేష్ భేటీ

వాణీమోహన్ సేవలు అవసరం లేదని సీఎస్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మంగళవారం నాడు లేఖ రాశాడు.వాణీమోహన్ ను అధికారులు రిలీవ్ చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత  సెలవుపై వెళ్లిన జీవీ ప్రసాద్ ఇతర ఉద్యోగులను కూడ ప్రభావితం చేశారనే నెపంతో ఆయనపై సోమవారం నాడు వేటేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.ఎన్నికల విధులకు ఆటంకం కల్గించేవారిపై చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు.

also read:రూల్స్ బ్రేక్: ఎస్ఈసీ జాయింట్ డైరెక్టర్ జీవీ సాయిప్రసాద్ పై నిమ్మగడ్డ వేటు

ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను డివిజన్ బెంచ్ లో ఏపీ ఎస్ఈసీ సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ సాగుతోన్న విషయం తెలిసిందే. 
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios