స్థానిక ఎన్నికల 'పంచాయితీ': గవర్నర్‌తో నిమ్మగడ్డ రమేష్ భేటీ

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంగళవారం నాడు ఉదయం రాజ్‌భవన్ లో భేటీ అయ్యారు.

AP SEC Nimmagadda Ramesh kumar meets Ap governor Biswabhusan harichandan lns


అమరావతి: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంగళవారం నాడు ఉదయం రాజ్‌భవన్ లో భేటీ అయ్యారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో మాసంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ను ఏపీ హైకోర్టు సోమవారం నాడు సస్పెండ్ చేసింది.

also read:సింగిల్ జడ్జి ఆదేశాలు: హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఎస్ఈసీ పిటిషన్

హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నాడు రిట్ పిటిషన్ ను దాఖలు చేసింది.ఈ రిట్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది.విచారణను ఇవాళ మధ్యాహ్ననికి వాయిదా వేసింది.

&

nbsp;

 

ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి దారి తీసిన పరిస్థితులతో పాటు డివిజన్ బెంచ్ ను ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చిందనే విషయాలను గవర్నర్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరించే అవకాశం ఉంది.

కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్దంగా లేమని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నెల 16వ తేదీ నుండి కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను సస్పెండ్ చేసినట్టుగా ఏపీ హైకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు చోటు చేసుకొన్న పరిణామాలను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు వివరించనున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios