జగన్‌కు ఈసీ రమేశ్ కుమార్ మరో షాక్: కేంద్రానికి సీరియస్ లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం రోజుకొక మలుపు తిరుగుతోంది. తాజాగా ఏపీ ఎన్నికల కమీషనర్ రమేశ్ కుమార్ గురువారం కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. 

ap sec ramesh kumar letter to union home secretary over security threat

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం రోజుకొక మలుపు తిరుగుతోంది. తాజాగా ఏపీ ఎన్నికల కమీషనర్ రమేశ్ కుమార్ గురువారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు.

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. రాష్ట్రంలో తనకు భద్రత కరువైందని కుటుంబసభ్యులతో పాటు తనపై దాడులు జరిగే అవకాశం ఉందని ఆయ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read:జగన్ సర్కార్‌కు ఊరట: ఏపీలో ఎన్నికల కోడ్‌ నిలిపివేత, ఉత్తర్వులు జారీ

ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఇబ్బందుల నేపథ్యంలో కేంద్ర బలగాలను ఏపీకి పంపాలని రమేశ్ కోరారు. కేంద్ర బలగాల భద్రత మధ్యే స్థానిక ఎన్నికలు జరపాల్సిన అవసరం, అగత్యం ఉందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రారంభించేందుకు ముందే భద్రతకు సంబంధించిన వివరాలను గురించి ప్రభుత్వాన్ని అడిగానని చెప్పారు. ఆయనప్పటికీ ప్రభుత్వం తాను అడిగిన సమాచారం అందించడంతో విఫలమయ్యారని రమేశ్ ఘాటుగా విమర్శించారు.

ఆరువారాల పాటు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయినప్పటికీ.. తర్వాత ప్రారంభమయ్యే ఎన్నికల్లోనైనా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో తాను ఉన్నానని రమేశ్ తెలిపారు.

5 పేజీల లేఖలో ప్రధానంగా ఏపీలో జరిగిన ఏకగ్రీవాలపైనే పేర్కొన్నారు. 2014 ఎంపీటీసీ ఎన్నికల్లో కేవలం 2 శాతం ఏకగ్రీవాలు మాత్రమే జరిగాయని... అయితే ఇప్పుడు 24 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవాలు అయ్యాయన్నారు.

Also Read:వైఎస్ జగన్ కు షాక్: స్థానిక ఎన్నికలపై తేల్చేసిన సుప్రీంకోర్టు

సమైక్య రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క జడ్పీటీసీ ఏకగ్రీవం అయ్యిందని, ఇప్పుడు 126 జడ్పీటీసీలు ఏకగ్రీవం కావడంపై రమేశ్ లేఖలో పేర్కొన్నారు. కడప జిల్లాలో 79 శాతం ఎంపీటీసీలు, 76 శాతం జడ్పీటీసీలు ఏకగ్రీవం కావడంపై ఎస్ఈసీ ప్రస్తావించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పరిస్ధితులు అనుకూలంగా లేవని, ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే కేంద్ర బలగాలు అవసరమని నిమ్మగడ్డ రమేశ్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఎన్నికల విజయం సాధించాలని మంత్రులకు సీఎం టార్గెట్ ఇవ్వడంపైనా ఆయన లేఖలో పేర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios