Asianet News TeluguAsianet News Telugu

స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్: కలెక్టర్లతో నేడు నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్

ఏపీలో స్థానిక సంస్థలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల నిర్వహణ విషయంలో  రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా నిర్ణయాలు తీసుకొంటుంది. 

AP SEC plans to conduct video conference with collectors over ap local body elections lns
Author
Guntur, First Published Jan 25, 2021, 4:31 PM IST

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల నిర్వహణ విషయంలో  రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా నిర్ణయాలు తీసుకొంటుంది. 

ఇవాళ సాయంత్రం కలెక్టర్లతో ఎస్ఈసీ  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కొందరు ఎన్నికల విధులకు దూరంగా ఉంటామని చేసిన ప్రకటనను కేంద్ర కేబినెట్ సెక్రటరీకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు.

ఎన్నికల విధులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం సహకరించకపోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఇవ్వాలని ఆ లేఖలో కోరారు.  అంతేకాదు ఎన్నికల షెడ్యూల్ ను రీ షెడ్యూల్ చేసింది.మరో వైపు ఎన్నికల నిర్వహణకు సంబంధించి కలెక్టర్లతో ఎపీ ఎస్ఈసీ సోమవారం నాడు సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 

also read:ఏపీ సిబ్బంది సహాయ నిరాకరణ: కేంద్ర హోం కార్యదర్శికి నిమ్మగడ్డ లేఖ

ఏపీలో స్థానిక సంస్థల  ఎన్నికల నిర్వహణకు ఏపీ హైకోర్టు ధర్మాసనం ఈ నెల 21న తీర్పు ఇచ్చింది.  ఈ తీర్పుతో ఈ నెల 8వ తేదీన ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగానే ఎన్నికలు నిర్వహిస్తామని  ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

పంచాయితీరాజ్ శాఖ అధికారులు ఎస్ఈసీ సమావేశానికి హాజరుకాలేదు. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయితీరాజ్ శాఖ అధికారులకు మెమో కూడ జారీ చేశారు.

సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసినందున... సోమవారం నాడు ఈ పిటిషన్ విచారణ వచ్చే అవకాశం ఉన్నందున ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ రాసిన లేఖను పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఎస్ఈసీకి అందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios