Asianet News TeluguAsianet News Telugu

ఇద్దరు కలెక్టర్ల బదిలీ పంచాయతీ: గవర్నర్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు

: చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్ల విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.
 

AP SEC plans to complaint against government on chittoor, guntur collectors transfer issue lns
Author
Guntur, First Published Jan 22, 2021, 10:44 AM IST

అమరావతి: చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్ల విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.గత ఏడాది మార్చిలో ఈ రెండు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయాలని ఎస్ఈసీ ఆదేశించింది. ఈ రెండు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో  అక్రమాలు చోటు చేసుకొన్నాయని విపక్షాలు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశాయి. వీటి ఆధారంగా ఈ రెండు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయాలని ఆదేశించింది.

కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం: సీఎస్‌కి లేఖ రాయనున్న నిమ్మగడ్డ

గత ఏడాది మార్చిలో ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినా కూడ ప్రభుత్వం ఈ రెండు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయలేదు. ఈ ఏడాది పిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయమై గురువారం నాడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో  ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ కాన్ఫరెన్స్ సమయంలో ఈ రెండు జిల్లాల కలెక్టర్లను మినహాయించి ఇతర జిల్లాల కలెక్టర్లతో ఆయన స్థానిక సంస్థల ఎన్నికల విషయమై చర్చించారు.ఈ రెండు జిల్లాల జాయింట్ కలెక్టర్లతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్చించారు.  గత ఏడాదిలో ఆదేశాలు జారీ చేసినా ఈ ఇద్దరిని బదిలీ చేయకపోవడంపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు ఎస్ఈసీ.
 

Follow Us:
Download App:
  • android
  • ios