ఏపీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బుధవారం గవర్నర్ బిశ్వభూషణ్‌తో భేటీకానున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై గవర్నర్‌తో చర్చించనున్నారు.

అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ వివిధ స్థాయిల్లో వున్న అధికారులతో రేపు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

Also Read:నిమ్మగడ్డ వైఖరిపై అనుమానాలున్నాయి: సజ్జల సంచలన వ్యాఖ్యలు

అంతకుముందు ఏపీలో ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయించారు. ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ఎస్ఈసీ దీనికి సంబంధించిన సమగ్ర షెడ్యూల్ త్వరలో రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. అయితే, ఇప్పుడే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికలకు నాలుగు వారాల నుంచి కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పారు