Asianet News TeluguAsianet News Telugu

ప్రవీణ్ ప్రకాశ్ వ్యవహారం: నా ఆదేశాలనే అమలు చేయరా.. నిమ్మగడ్డ హెచ్చరికలు

ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ తొలగింపు వ్యవహారంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ సీరియస్ అయ్యారు. ప్రవీణ్ ప్రకాశ్‌ను తొలగించాలంటూ తాను ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై తీవ్రంగా స్పందించారు నిమ్మగడ్డ. 

ap sec nimmagadda ramesh kumar serious on praveen prakash issue ksp
Author
Amaravathi, First Published Jan 30, 2021, 5:10 PM IST

ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ తొలగింపు వ్యవహారంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ సీరియస్ అయ్యారు. ప్రవీణ్ ప్రకాశ్‌ను తొలగించాలంటూ తాను ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై తీవ్రంగా స్పందించారు నిమ్మగడ్డ.

తన ఆదేశాలు అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్. ఇక అంతకుముందు తనపై అభియోగాలు మోపుతూ ఎస్ఈసీ రాసిన లేఖకు వివరణ ఇచ్చారు సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్.

Also Read:నిమ్మగడ్డ మరో సంచలనం: మంత్రులు, సలహాదారులకు ప్రభుత్వ వాహనాలు కట్

తాను నిబంధనల మేరకే వ్యవహరించాను తప్ప ఎక్కడా పరిధి దాటలేదని స్పష్టం చేశారు. తాను ఎవ్వరిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదని పేర్కొంటూ ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన లేఖను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు రాశారు ప్రవీణ్ ప్రకాశ్.

జనవరి 25న ఎస్ఈసీ రాసిన లేఖకు మరుసటి రోజే సమాధానమిచ్చినట్లు తెలిపారు ప్రవీణ్. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ సీఎస్ ద్వారానే జరపాలని ఎస్ఈసీని కోరానని ప్రవీణ్ ప్రకాశ్ వెల్లడించారు. స్వతంత్రంగా వ్యవహరించే అధికారం తనకు లేదన్న ప్రవీణ్ ప్రకాశ్ ఈ పరిస్ధితుల్లో తనను తప్పు బట్టడం ఎంత వరకు న్యాయమంటూ వాపోయారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios