Asianet News TeluguAsianet News Telugu

నిమ్మగడ్డ దూకుడు.. ఫిబ్రవరి 1 నుంచి ఐదు జిల్లాల్లో టూర్

పంచాయతీ ఎన్నికలపై ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పీడ్ పెంచారు. ఎన్నికలను సవ్యంగా నిర్వహించేందుకు గాను జిల్లాల వారీగా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాయలసీమ పర్యటనకు శ్రీకారం చుట్టిన నిమ్మగడ్డ శుక్రవారం అనంతపురం, కర్నూలు జిల్లాల అధికారులతో భేటీ అయ్యారు.

ap sec nimmagadda ramesh kumar ready for uttarandhra tour ksp
Author
Amaravathi, First Published Jan 29, 2021, 6:58 PM IST

పంచాయతీ ఎన్నికలపై ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పీడ్ పెంచారు. ఎన్నికలను సవ్యంగా నిర్వహించేందుకు గాను జిల్లాల వారీగా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే రాయలసీమ పర్యటనకు శ్రీకారం చుట్టిన నిమ్మగడ్డ శుక్రవారం అనంతపురం, కర్నూలు జిల్లాల అధికారులతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రమేశ్‌కుమార్‌ త్వరలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు.

ఈరోజు, రేపు రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన.. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు వెళ్లనున్నారు

  • 1వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరనున్న ఎస్‌ఈసీ.. మధ్యాహ్నం 1.30గంటలకు విశాఖ చేరుకుంటారు. 
  • అక్కడి నుంచి 2.30 గంటలకు శ్రీకాకుళం బయల్దేరి వెళ్తారు. 
  • సాయంత్రం 4.30 గంటల నుంచి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 
  • అనంతరం అక్కడి నుంచి బయల్దేరి విజయనగరం వెళ్లనున్నారు.
  • సాయంత్రం 7 గంటల నుంచి అక్కడి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 
  • ఆ తర్వాత విశాఖ వెళ్లి అక్కడే రాత్రి బస చేస్తారు.
  • 2వ తేదీ ఉదయం 9 గంటలకు విశాఖ జిల్లా అధికారులతో, మధ్యాహ్నం 1.30 గంటలకు కాకినాడ వెళ్లి తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. 
  • అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి ఏలూరు చేరుకుంటారు. 
  • అక్కడ రాత్రి 7 గంటల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేయనున్నారు.  అదే రోజు రాత్రి మళ్లీ విజయవాడ చేరుకుంటారు.
Follow Us:
Download App:
  • android
  • ios