ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ తీరుపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని ఆయన అన్నారు.

అమరావతి: మునిసిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ తీరుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎపి ఎస్ఈసీ) స్పందించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని ఆయన అన్నారు. బలవంతం నామినేషన్ల ఉపసంహరణపై జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 

తిరుపతి బాధిత అభ్యర్థు విషయంలో చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఎస్ఈసీలోని సంయుక్త కార్యదర్శి ఫిర్యాదులు తీసుకుంటారని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మునిసిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో 2794 వార్డులున్నాయి. వీటిలో 578 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో వైసీపీ 570 వార్డులు గెలుచుకున్నారు. టీడీపీ ఐదు వార్డులను గెలుచుకుంది. బిజెపికి ఒక వార్డు ఏకగ్రీవంగా వచ్చింది. ఇతరులు ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కాగా, తిరుపతి 7వ డివిజన్ టీడీపీ అభ్యర్థి ఆందోళనకు దిగారు. ఫోర్జరీ సంతకం ద్వారా తన నామినేషన్ ను ఉపసహరించారని ఆరోపిస్తున్నారు. తన సమస్యను పరిష్కరించకపోతే ఆర్వో ముందే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తున్నారు.