గుంటూరు, చిత్తూరు జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గుంటూరుకు బసంత్ కుమార్‌‌ను, చిత్తూరుకు హరినారాయణకు తక్షణమే బాధ్యతలు అప్పగించాలని నిమ్మగడ్డ ఆదేశించారు. 

అంతకుముందు గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను బదిలీ చేయాలని ప్రభుత్వానికి ఎస్‌ఈసీ లేఖ రాసింది. ఎస్‌ఈసీ లేఖతో ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసింది. గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు శామ్యూల్ ఆనంద్, నారాయణ్ భరత్ గుప్తాలను ప్రభుత్వం జీఏడీకి సరండర్ చేసింది.

Also Read:చిత్తూరు, గుంటూరు కలెక్టర్ల బదిలీకి ఎస్ఈసీ సిఫారసు: సీఎస్ కు నిమ్మగడ్డ లేఖ

ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లకు కలెక్టర్లుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డిని సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేసిన ప్రభుత్వం… చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్‌కు తిరుపతి అర్బన్‌ ఎస్పీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.