ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ శనివారం అమరావతి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. ఎన్నికల ఏర్పాట్లపై ఉద్యోగులు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాకపోవడంతో నిమ్మగడ్డ హైదరాబాద్‌కు పయనమయ్యారు.

మరోవైపు ఉద్యోగుల సహాయ నిరాకరణ నేపథ్యంలో ఆయన రేపు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని భావించారు. అయితే రేపు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అపాయింట్‌‌మెంట్ ఖరారు కానట్లుగా తెలుస్తోంది.

Also Read:వెంకట్రామిరెడ్డిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్: డీజీపీకి లేఖ

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య నేత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. వెంకట్రామిరెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ సూచించారు.

తనకు ప్రాణహాని కలిగిస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. వెంకట్రామిరెడ్డి కదలికలపై నిఘా ఉంచాలని నిమ్మగడ్డ డీజీపీని కోరారు.

ఇవాళ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సీఎస్ ఆదిత్యనాథ్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు గైర్హాజరయ్యారు.