అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీుకున్నారు.  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైదరాబాద్‌లోని తనకు ఏర్పాటు చేసిన ప్రాంగణం నుండి కార్యాలయ సాధారణ   విధులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేశ్ కుమార్ శుక్రవారం ఉదయం ఆ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని గృహ స్థలాల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఎన్నికల  కమిషన్  క్లియర్ చేసినట్లు చెప్పారు. 
 రాష్ట్రంలో కొనసాగుతున్న పథకాలను కొనసాగించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని,  అందుకు అనుగుణంగా  కొనసాగుతున్న పథకమని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిందన్నారు.  వాస్తవాలను తగిన విధంగా పరిగణనలోకి తీసుకుని కమిషన్  ఆమోదం ఇచ్చినట్లు తెలిపారు.

Also Read: ఏపీ ఎస్‌ఈసీ రమేష్ కుమార్ లేఖ అందింది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఏపీ స్థానిక సంస్థలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎక్కింది. 

సుప్రీంకోర్టు రమేష్ కుమార్ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు చెప్పింది. ప్రస్తుతం అమలవుతున్న పథకాల అమలును కొనసాగడానికి అనుమతి ఇవ్వాలని ఈసీని ఆదేశించింది. అదే సమయంలో కొత్త పథకాలను అమలు చేయాలనుకుంటే ఈసీ అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Also Read: కేంద్రానికి లేఖపై ఏపీ ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ట్విస్ట్

కాగా, రమేష్ కుమార్ హైదరాబాదు నుంచి పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం సంచలనమైందే. తనకు తగిన భద్రత కల్పించాలని కోరుతూ ఆయన కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించినట్లు తెలుస్తోంది.