ఏకగ్రీవాలపై రగడ.. పార్లమెంట్, అసెంబ్లీల్లో ఉంటాయా: నిమ్మగడ్డ వ్యాఖ్యలు

ఏకగ్రీవాలు గుడ్డిగా ఆమోదించవద్దని స్పష్టంగా చెప్పానన్నారు ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్నారు.

ap sec nimmagadda ramesh kumar comments on unanimous elections ksp

ఏకగ్రీవాలు గుడ్డిగా ఆమోదించవద్దని స్పష్టంగా చెప్పానన్నారు ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్నారు.

ఇంకా వాటిపై నిర్ణయం తీసుకోలేదని.. పరిశీలిస్తున్నామని నిమ్మగడ్డ వెల్లడించారు. శాసనసభకు పోటీ ఉండాలని.. గ్రామాలకు మాత్రం వద్దా అని ఎస్ఈసీ ప్రశ్నించారు. సాధారణ ఏకగ్రీవాలకు తాను వ్యతిరేకం కాదని.. ఈసారి కూడా 15 శాతం లోపే ఏకగ్రీవాలు ఉంటాయని నిమ్మగడ్డ ఆశాభావం వ్యక్తం చేశారు.

యాప్‌పై కోర్టు కేసులు నిలబడవని... ఏకగ్రీవం కాకపోతే వాతావరణం కలుషితమవుతుందని అనుకోనని.. పార్లమెంట్, అసెంబ్లీలో ఏకగ్రీవాలుంటాయా అని ఎస్ఈసీ వ్యాఖ్యానించారు. 

Also Read:ఎలక్షన్ వద్దు.. సెలక్షన్ కావాలని అంటున్నారు, ఇకనైనా మారండి: నిమ్మగడ్డ

లక్షల మంది ఓటు వేసే అవకాశం కోల్పోవడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఎలక్షన్ వద్దు సెలక్షన్ కావాలని కొందరు అంటున్నారని... ఎన్నికలు ఆపడానికి ప్రయత్నిస్తూనే వున్నారని నిమ్మగడ్డ ఆరోపించారు.

ఏకగ్రీవాలను గుడ్డిగా ఆమోదించొద్దని అధికారులకు చెప్పానని అవసరమైతే ఏకగ్రీవాల విషయంలో విచక్షణాధికారాలు వినియోగించుకోవచ్చని రమేశ్ కుమార్ వెల్లడించారు.

ఎక్కడైనా ఏకగ్రీవాల విషయంలో ఫిర్యాదులు వస్తే వాటిని ఆపేస్తామని నిమ్మగడ్డ కుండబద్ధలు కొట్టారు. ఎన్ని ప్రయత్నాలు జరిగినా అంతిమ విజయం న్యాయానిదేనన్నారు.

రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్లు రద్దు చేయాలని దాఖలైన రెండు పిటిషన్లను ఏపీ హైకోర్టు ఇవాళ కొట్టేయడంతో న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం, విధేయత ఉందని నిమ్మగడ్డ తెలిపారు. రాజ్యాంగంలో ఉన్నదే ఈసీ అమలు చేస్తోందని .. తన పరిధిలో తాను బాధ్యతాయుతంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios