జగన్ తో భేటీ, నిమ్మగడ్డ సమావేశానికి డుమ్మా: అధికారులకు మెమో జారీ

ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వార్ సాగుతోంది.  ప్రభుత్వ అధికారుల తీరుపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ గా స్పందిస్తున్నారు.
 

AP SEC issued memo to panchayat raj officers on not attending meeting lns

ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వార్ సాగుతోంది.  ప్రభుత్వ అధికారుల తీరుపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ గా స్పందిస్తున్నారు.

ఏపీ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ లు  ఎస్ఈసీ ఏర్పాటు చేసిన  సమావేశానికి రాలేదు. దీంతో వీరికి ఎస్ఈసీ ఇవాళ మెమో జారీ చేసింది.

 

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై చర్చించేందుకు గాను శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకు తొలుత సమావేశం ఏర్పాటు చేశారు. అయితే గవర్నర్ తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీతో పాటు ఇతర కారణాలతో ఈ సమావేశాన్ని ఇవాళ సాయంత్రం మూడు గంటలకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

also read:జగన్ ప్రభుత్వంతో ఢీ: రేపే నిమ్మగడ్డ పంచాయతీ నోటిఫికేషన్

మూడు గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉంది. నాలుగు గంటల వరకు ఎదురు చూసిన ఎస్ఈసీ పంచాయితీరాజ్ కమిషనర్ కు జారీ చేసింది.ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు సమావేశం ఏర్పాటు చేసినట్టుగా ఎస్ఈసీ కార్యాలయం ఈ మెమోలో పేర్కొంది.  ఇదే చివరి అవకాశమని ఆ మెమోలో పేర్కొంది.

ఇవాళ ఉదయం పంచాయితీరాజ్ శాఖ అధికారులు గోపాలకృష్ణ ద్వివేదితో పాటు గిరిజా శంకర్ లు క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన విషయం తెలిసిందే. ఆ భేటీ తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏర్పాటు చేసిన సమావేశానికి వారు వస్తారని భావించారు. కానీ వారు డుమ్మా కొట్టారు. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వారిపై సీరియస్ అయ్యారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios