Asianet News TeluguAsianet News Telugu

AP PRC Issue: ప్రభుత్వ కమిటీతో చర్చలు జరిపే యోచనలో ఉద్యోగ సంఘాలు..?

ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ వివాదం (AP PRC Issue) కొనసాగుతుంది. ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం ఉద్యోగ సంఘాలు.. సమ్మెకు దిగడానికి సిద్దమయ్యాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభుత్వ కమిటీతో చర్చలు జరిపే యోచనలో ఉద్యోగ సంఘాలు (employees unions) ఉన్నట్టుగా తెలుస్తోంది.

AP PRC Issue Employees may talks with government committee
Author
Amravati, First Published Jan 25, 2022, 10:02 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ వివాదం (AP PRC Issue) కొనసాగుతుంది. ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం ఉద్యోగ సంఘాలు.. సమ్మెకు దిగడానికి సిద్దమయ్యాయి. ఈ క్రమంలోనే సోమవారం సచివాలయంలో జీఏడీ కార్యదర్శి శశిభూషణ్ సమ్మె నోటీసు ఇచ్చారు. మరోవైపు  ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులతో కోసం.. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, పేర్నినాని (Perni Nani), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చర్చలకు హాజరుకావాలని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం పంపింది. 

అయితే ఉద్యోగ సంఘాలు పీఆర్సీ ఉత్తర్వులు రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చల విషయం ఆలోచిస్తామని పీఆర్సీ సాధన సమితి తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం ఉద్యోగుల కోసం సచివాలయంలో మంత్రుల కమిటీ వేచి చూసినప్పటికీ ఉద్యోగ సంఘాలు చర్చలకు వెళ్లలేదు. తాజాగా ఉద్యోగ సంఘాలు తమ వైఖరిని మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ కమిటీతో చర్చలకు హాజరు కావాలనే యోచనలో ఉద్యోగ సంఘాలు ఉన్నట్టుగా సమాచారం. ఈరోజు ఉదయం 11 గంటలకు భేటీ కానున్న ఉద్యోగ సంఘాలు ఈ విషయంపై చర్చించి.. అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 

మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మంత్రుల కమిటీతో చర్చలకు ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ సభ్యులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై ఉద్యోగ సంఘాల వైపు నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

ఇక, సోమవారం సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత పీఆర్సీ సాధన సమితి సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. తమతో చర్చలకు ప్రభుత్వం ముగ్గురు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,  రాష్ట్ర ప్రభుత్వ సలహదారులతో కలిపి కమిటీ ఏర్పాటు చేసిన విషయమై తాము  మీడియాలో చూసి తెలుసుకొన్నామన్నారు.   ఈ విషయమై తాము ఈ కమిటీ అధికార పరిధి గురించి తాము ప్రశ్నించామన్నారు. దీంతో ఇవాళ ఈ కమిటీ నియామకం గురించి ప్రభుత్వం జీవోను ఇచ్చిందని సూర్యనారాయణ జీవో కాపీని మీడియాకు చూపించారు.

PRCపై ఏర్పాటు చేసిన Ashutosh Mishra కమిటీ నివేదిక ఇవ్వడంతో  జనవరి నెలకు పాత జీతాన్ని ఇస్తేనే ఈ కమిటీతో చర్చలకు వెళ్తామని పీఆర్సీ సాధన సమితి  నేత సూర్యనారాయణ తేల్చి చెప్పారు. Strike  నోటీసు ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తాయని అనుకోలేదని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios