విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పాలీసెట్-2020 ఫలితాలు శుక్రవారం నాడు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము విడుదల చేశారు.

 ఏపీ పాలీసెట్ 2020 లో 84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది పాలీసెట్ పరీక్షకు 88, 372 మంది అభ్యర్ధులు నమోదు చేసుకొన్నారు. వీరిలో 71,631 మంది పరీక్షలు రాశారు. పరీక్ష రాసిన వారిలో 60,780 మంది ఉత్తీర్ణత సాధించారు.

50,706 మంది పరీక్షలు రాస్తే 42,313 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 20,925 మంది పరీక్ష రాస్తే 18,467 మంది ఉత్తీర్ణత సాధించారు.పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మట్టా దుర్గాసాయి కీర్తితేజ  120 మార్కులతో ఫస్ట్ ర్యాంకు సాధించాడు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సుంకర అక్షయ ప్రణీత్ 119 మార్కులతతో రెండో ర్యాంకు పొందాడు.  ఇదే జిల్లాకు చెందిన సవిలత శ్రీదత్త శ్యామ్ సుందర్ మూడో ర్యాంకు దక్కించుకొన్నాడు.

2020-21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ఎయిడెడ్ ప్రైవేట్ కు సంబంధించి 271 కాలేజీల్లో 66,742 సీట్లు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.