అమరావతి: జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చారంటూ వస్తున్న వార్తలను ఖండించారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. రాపాకకు షోకాజ్ నోటీసులు జారీ చేశామంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. 

రాపాకకు షోకాజ్ నోటీసులు ఇచ్చానంటూ అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని దాన్ని నియోజకవర్గ ప్రజలు నమ్మవద్దన్నారు. ఈ తప్పుడు ప్రచారంపై వైసీపీ నేతలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

 

తమ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పైనా, తమ పార్టీపైనా వైసీపీ మద్దతు దారులు చేస్తున్న దుష్ప్రచారం మానుకోవాలని పవన్ హితవు పలికారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ‘రైతు సౌభాగ్య దీక్ష’లో తానుంటే అసెంబ్లీలో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేశానంటూ తప్పుడు ప్రచారం చేయడంపై మండిపడ్డారు. 

షోకాజ్ నోటీస్: పవన్ కల్యాణ్ మీద ఎమ్మెల్యే రాపాక తిరుగుబాటు...

వైసీపీకి చెందిన వెబ్‌సైట్‌లోనే ముందుగా ఈ వార్త రావడంతో ఈ దుష్ప్రచారం వెనుక ఎవరు ఉన్నారో అర్థమవుతుందని పవన్ తన ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. ఈ ప్రచారం వెనుక ఎవరు ఉన్నారో అర్థమవుతుందని అన్నారు. ఈ ప్రచారాన్ని రాజోలు నియోజకవర్గ ప్రజలు ఖండించాలని పవన్ పిలుపునిచ్చారు. 

రాపాక వరప్రసాద్ ను అరెస్ట్ చేసి బెయిల్ రానివ్వకుండా వైసీపీ నేతలు ప్రయత్నించినప్పుడు స్వయంగా తానే రంగంలోకి దిగానని గుర్తు చేశారు. తాను రంగంలోకి దిగడంతో వైసీపీ వాళ్లు వెనకడుగు వేశారని చెప్పుకొచ్చారు. 

ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నందుకు రాపాకకు వైసీపీ మద్దతుదారులు క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. 
వీధి బడిలో చదువుకున్నా.. తిట్లు నాక్కూడా వచ్చు: జగన్‌కు పవన్ సవాల్...