గంటాకు వరంగా జగన్ నిర్ణయం: సీఎం పై ప్రశంసలు అందుకేనా..
విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా అయ్యే అవకాశాలున్నాయంటూ శాసనసభలో సీఎం వైఎస్ జగన్ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు తన ట్విట్టర్ లో తెలిపారు. అధికారిక వికేంద్రీకరణలో భాగంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ కావొచ్చన్న సీఎం నిర్ణయం మంచిదంటూ కొనియాడారు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించడంపై గంటా హర్షం వ్యక్తం చేశారు.
విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా అయ్యే అవకాశాలున్నాయంటూ శాసనసభలో సీఎం వైఎస్ జగన్ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు తన ట్విట్టర్ లో తెలిపారు. అధికారిక వికేంద్రీకరణలో భాగంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ కావొచ్చన్న సీఎం నిర్ణయం మంచిదంటూ కొనియాడారు.
తిండి లేక తండ్రి ఏడుస్తుంటే.. కొడుకొచ్చి: మూడు రాజధానులపై పవన్ స్పందన..
సముద్ర తీర ప్రాంతమైన విశాఖను పరిపాలనా రాజధాని చేయడం సరైనదేనని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. రోడ్డు, రైలు, విమానయానం, జల రవాణాతో అనుసంధానమైన విశాఖ నగరం పరిపాలనా రాజధానిగా మారితే విశ్వనగరంగా మారబోతుందన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలందరి ఆశలు, ఆకాంక్షల్ని నెరవేర్చే సిటీగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటూ తన అభిప్రాయాన్ని వెలబుచ్చారు గంటా శ్రీనివాసరావు.
ఇకపోతే మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించడం వెనుక రాజకీయ మతలబు ఉందని ప్రచారం జరుగుతుంది. గత కొంతకాలంగా వైసీపీలో చేరాలని భావిస్తున్న గంటాకు జగన్ నిర్ణయం ఒక వరంగా మారబోతుందని తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీని వీడేందుకు ఎలాంటి షాకులు దొరక్కపోవడంతో గంటా వేచి చూస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ వైసీపీలో చేరాలని గంటా భావిస్తే జగన్ తీసుకున్న నిర్ణయాన్ని షాకుగా చూపించి చేరే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతుంది.
ఏపీకి మూడు రాజధానులు వచ్చే ఛాన్స్: అసెంబ్లీలో జగన్...