విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. సీఎం జగన్ ను చిట్టిరెడ్డీ అని సంబోధిస్తూ డైలాగ్ లు వేశారు బుద్దా వెంకన్న. 

ట్విట్టర్ వేదికగా జగన్ పై ఘాటు విమర్శలు చేశారు. తండ్రి గెలిచిన చోట గెలిచి కాలర్ ఎగరేస్తాడు చిట్టి రెడ్డి, కన్న తల్లిని గెలిపించుకోలేని అసమర్థుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నింట్లో నాదే పైచేయి అంటాడంటూ విరుచుకుపడ్డారు. 

 

దొంగ పనులు చేసి దొరికిపోయి చిప్పకూడు తిన్నా బడాయి మాటలు మాట్లాడతాడు చిట్టి రెడ్డి అంటూ జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిపై కూడా సెటైర్లు వేశారు బుద్ధా వెంకన్న. జగన్ జైల్లో ఉన్న ఆ చరిత్ర మర్చిపోయారా అంటూ విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు. 

ఆ ఎమ్మెల్యే నా నియోజకవర్గాన్ని పూర్తిగా నాకేశాడు: రాపాక సంచలన వ్యాఖ్యలు...

మంగళగిరి ఎన్నికల్లో నారా లోకేష్‌ని ఓడించడానికి వైఎస్ కుటుంబం మొత్తం రంగంలోకి దిగాల్సివచ్చిందని చెప్పుకొచ్చారు. పెయిడ్ ఆర్టిసులు కూడా అక్కడే మకాం వేశారని బుద్దా వెంకన్న విమర్శించారు. ఈ విషయం కూడా మర్చిపోతే ఎలా అంటూ నిలదీశారు. 

మంగళగిరి నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం రూ. 200 కోట్లు ఖర్చు చేసినట్టు విజయసాయిరెడ్డి మాటల్లోనే బయట పెట్టినందుకు ధన్యవాదాలు అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చెప్పుకొచ్చారు. 

మాజీమంత్రి అచ్చెన్నాయుడుపై వైసీపీ ప్రివిలేజ్ మోషన్...