తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో ఆయన సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. మస్తాన్ రావును రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీసుకుని వచ్చి జగన్ వద్దకు తీసుకువచ్చారు.
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అద్భుత పాలన నచ్చి తాను వైసీపీలో చేరినట్లు తెలిపారు టీడీపీ మాజీ నేత బీద మస్తాన్ రావు. నెల్లూరు జిల్లా టీడీపీలో కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు శనివారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో ఆయన సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. మస్తాన్ రావును రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీసుకుని వచ్చి జగన్ వద్దకు తీసుకువచ్చారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయని బీద మస్తాన్ రావు అన్నారు. అనతికాలంలోనే 80 శాతంపైగా ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్నారని బీద మస్తాన్ రావు ప్రశంసించారు.
ఎలక్షన్ మ్యానిఫెస్టోను వైసీపీ భగవద్గీత, బైబుల్, ఖురాన్‌గా భావిస్తోందని బీద మస్తాన్ రావు అభిప్రాయపడ్డారు. తనకు రాజకీయంగా ఎవరితోనూ వ్యక్తిగత విబేధాలు లేవని స్పష్టం చేశారు.
ఇకపోతే బీద మస్తాన్‌రావు శుక్రవారం తెలుగుదేశం పార్టీతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
బీద మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీ వీడటం ఆ పార్టీకి తీరని నష్టంగానే చెప్పుకోవచ్చు. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు బీద సోదరులు. బీద మస్తాన్ రావు సోదరుడు బీద రవిచంద్ర యాదవ్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.
అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. బీద మస్తాన్ రావు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడం తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ అనే చెప్పాలి. అయితే త్వరలోనే బీద రవిచంద్ర సైతం వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది.
బాబుకు మరో షాక్: టీడీపీకి బీద మస్తాన్ రావు గుడ్ బై
