నెల్లూరు: టీడీపీకి బీద మస్తాన్‌రావు  రాజీనామా చేశారు. ఈ నెల 7వ తేదీన బీద మస్తాన్ రావు  వైసీపీలో చేరనున్నారు. గత కొంత కాలంగా బీద మస్తాన్ రావు  టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో నెల్లూరు నుండి  ఎంపీ అభ్యర్ధిగా ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

2014 ఎన్నికల్లో కావలి నుండి  ఆయన  టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో నెల్లూరు నుండి ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించిన ఆదాల ప్రభాకర్ రెడ్డి చివరి నిమిషంలో వైసీపీలో చేరడంతో బీద మస్తాన్ రావు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేయాల్సి వచ్చింది.

పది రోజుల క్రితమే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని బీద మస్తాన్ రావు కలిశాడు. ఈ సమయంలోనే ఆయన వైసీపీలో చేరికకు రంగం సిద్దమైంది.వైసీపీ చీఫ్  జగన్ ను కూడ మస్తాన్ రావు కలిసినట్టుగా చెబుతున్నారు. దీంతో మస్తాన్ రావు టీడీపీకి రాజీనామా చేసినట్టుగా చెబుతున్నారు.  ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.