ఏప్రిల్ 2 నాటికి ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్ర ప్రణాళిక శాఖ (ap planning department) కార్యదర్శి విజయ్ కుమార్ (vijay kumar) . రాష్ట్రపతి ఆమోద ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఉద్యోగులు, జోనల్ విభజన వుంటుందని ఆయన చెప్పారు. తుది నోటిఫికేషన్ సిద్ధమైనప్పుడు కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని విజయ్ కుమార్ పేర్కొన్నారు.
ఏప్రిల్ 2 నాటికి ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్ర ప్రణాళిక శాఖ (ap planning department) కార్యదర్శి విజయ్ కుమార్ (vijay kumar) . రాష్ట్రపతి ఆమోద ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఉద్యోగులు, జోనల్ విభజన వుంటుందని ఆయన చెప్పారు. కొన్ని జిల్లాల నుంచి ప్రాంతాలను సర్దుబాటు చేయాలనే డిమాండ్లు వస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. అభ్యంతరాలను అధికారుల స్థాయిలోనే పరిశీలిస్తామని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎక్కడా అసెంబ్లీ నియోజకవర్గాలను విభజన చేయడం లేదని ఆయన వివరించారు.
తుది నోటిఫికేషన్ సిద్ధమైనప్పుడు కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని విజయ్ కుమార్ పేర్కొన్నారు. మూడు లక్షల చదరపు అడుగుల్లో కొత్త భవనాల నిర్మాణానికి సీఎం జగన్ ఆదేశించారని ఆయన తెలిపారు. కొత్త జిల్లాలు ఏర్పాటైతే నవోదయ విశ్వవిద్యాలయాలు, మెడికల్ కాలేజీలు లాంటి వాటి గురించి కేంద్రాన్ని అడిగే అవకాశం వుంటుందని విజయ్ కుమార్ వెల్లడించారు.
అంతకుముందు గత ఆదివారం విజయవాడలో విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కొత్త జిల్లాలపై మార్చి 3వ తేదీ వరకు కలెక్టర్లకు సూచన ఇవ్వొచ్చని తెలిపారు. సూచనలు అన్నింటినీ పరిశీలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan) ఆదేశించినట్టుగా చెప్పారు. మార్చి మూడో వారంలో కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ఏప్రిల్ 2న ఉగాది నుంచి కొత్త జిల్లా నుంచి పాలన ప్రారంభమవుతుందని అన్నారు.
కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌లు నిర్మిస్తామని, ఎస్పీ కార్యాలయంతో సహా అన్ని కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటుచేస్తామని విజయ్‌కుమార్ తెలిపారు. 4లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కలెక్టరేట్‌లు నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక కేంద్ర ప్రభుత్వానికి నోటిఫై కోసం సమాచారం ఇస్తామని వివరించారు. జిల్లాలు ఏర్పాటుకు కేంద్రం అనుమతి అవసరం లేదని..జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత కేంద్రం నోటిఫై చేస్తుందన్నారు. మార్చి నెలలో అన్ని జిల్లాల్లో ఉద్యోగుల విభజన చేపడతామని తెలిపారు. ఉద్యోగుల ప్రమోషన్లు, సర్వీస్‌కి ఇబ్బందులు ఉండవని.. వర్క్ టు సెర్వ్ కింద ఉద్యోగులను కేటాయిస్తామని చెప్పారు.
రెండు చోట్ల మాత్రమే ఉద్యోగుల జోనల్ సమస్యలు ఉంటాయని చెప్పారు. ఇక, ఏపీలో ఇప్పుడున్న జిల్లాలకు అదనంగా 13 జిల్లాలను కలుపుతూ 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉగాది నుంచే రాష్ట్రంలో కొత్త జిల్లాల నుంచి ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులకు సీఎం జగన్ సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ఉగాది నుంచే కొత్త జిల్లాలు ఉనికిలోకి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే రోజు నుంచే కలెక్టర్లు, ఎస్పీల కార్యకలాపాలు ప్రారంభించేలా సన్నాహాలు చేసుకోవాలన్నారు. మార్చిలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కొత్త జిల్లాల బిల్లు ప్రవేశపెట్టనున్నారు.
