విజయవాడ: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై ఏపీ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ్మినేని సీతారాం స్పీకర్ గా పనిచేస్తున్నారా లేక బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారా అంటూ విరుచుకుపడ్డారు. 

ఇటీవలే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పై స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ మహిళను అవమానపరిచేలా వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డారు.  

సోనియాగాంధీ గురించి స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై విజయవాడ సీపీ ద్వారకా తిరుమల రావుకు ఫిర్యాదు చేశారు. స్పీకర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.  

వైసీపీ మంత్రులు, స్పీకర్ మాట్లాడుతున్న భాష చాలా అభ్యంతరకరంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులుగా ఉంటూ వారు ప్రయోగిస్తున్న భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారంటూ చెప్పుకొచ్చారు.  

స్పీకర్ తమ్మినేని సీతారాంపై సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని కోరారు. స్పీకర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వైసిపి ప్రభుత్వంలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందంటూ పీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

స్పీకర్ స్థానంలో ఉండి ఆ మాటలేంటీ: తమ్మినేనికి యనమల ఘాటు లేఖ