YS Sharmila: షర్మిల దూకుడు.. ఢిల్లీ వేదికగా భారీ స్కెచ్!
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటు కరణను వ్యతిరేకిస్తూ వైఎస్ షర్మిరెడ్డి ఢిల్లీలో దీక్ష చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో దీక్షకు హాజరు కావాలని కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులను దీక్షకు హాజరు కావాలని ఏపీ కాంగ్రెస్ నేతలు కోరినట్టు తెలుస్తోంది.
YS Sharmila: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎలాగైనా మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని అధికార వైసీపీ వ్యూహాలు రచిస్తుండగా.. వైఎస్ జగన్ ను సీఎం కూర్చీ నుంచి దించి.. అధికారాన్ని దక్కించుకోవాలని ప్రతిపక్ష టీపీడీ- జనసేనలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల(YS Sharmila) తన పార్టీకి పూర్వవైభవ తీసుకరావాలని దూకుడు పెంచింది. ఈ క్రమంలో ప్రచారంలో దూసుకుపోతూ.. టీడీపీ(TDP), వైసీపీ(YCP)లపై విమర్శల వర్షం కురిపిస్తోంది.
ముఖ్యంగా తన సోదరుడు, సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకపడుతోంది. కేంద్రంలోని అధికార బీజేపీకి బానిసలుగా మారి రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారని మండిపడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై ప్రశించినా జగన్ .. అధికారం రాగానే.. ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కచ్చితంగా ప్రత్యేక హోదాను ఇస్తామని హామీ ఇస్తున్నారు. ప్రత్యేక హోదా తెస్తానని హామీతోనే జగన్ అధికారంలోకి వచ్చారని, ఈ ఐదేళ్లలో ఆ అంశాన్నే కేంద్రం వద్ద జగన్ ప్రస్తావించలేదని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన అన్నపై ప్రత్యేక హోదా అస్త్రాన్నే ప్రయోగించాలని ఆమె నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా , విశాఖ ఉక్కు ప్రైవేటు కరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీ వేదికగా పోరాటాలకు సిద్ధమయ్యారు షర్మిల. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 2న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో దీక్షకు హాజరు కావాలని కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులను దీక్షకు హాజరు కావాలని ఏపీ కాంగ్రెస్ నేతలు కోరినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 1 నాటికి ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, డీసీసీ అధ్యక్షులంతా హస్తిన రావాలని షర్మిల ఇప్పటికే పిలుపిచ్చారు.
ఏపీ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ(BJP) మాట తప్పిందని, రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో పాటు పలువురు నేతలు పాల్గొంటారని తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకరావడానికి షర్మిల(YS Sharmila) దూకుడు పెంచింది.