అమరావతి: ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి తనకు కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శికి ఆహ్వానం పంపడంపై ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరెడ్డి మనస్తాపానికి గురయ్యారు. ఈ విషయమై ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి  బుధవారం నాడు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తనకు ఆహ్వానం పంపకుండా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శికి ఆహ్వానం పంపడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోందన్నారు.

అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని తాను కోరితే చంద్రబాబునాయుడు స్పందించలేదని  రఘువీరారెడ్డి గుర్తుచేశారు. ఇవాళ నిర్వహించే అఖిలపక్షం వల్ల ఉపయోగం లేదన్నారు. వంద రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానుందని రఘువీరారెడ్డి  విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపీకి  ప్రత్యేక హోదా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.