అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమీషన్ పంచాయితీ ఎన్నికల పర్యవేక్షణ కోసం ఏర్పాటుచేసిన ఈ‌‌-వాచ్ యాప్ లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ఈ యాప్ సెక్యూరిటీ ఆడిట్ సర్టిఫికెట్ కోసం  ఏపీటీఎస్ కు బాధ్యతలు అప్పగించారు. ఏపీటీఎస్ ఈ యాప్ ను పరిశీలించి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులోకి రానుంది. 

గ్రామ పంచాయితీ ఎన్నికల పర్యవేక్షణ కోసం గత బుధవారమే ఎస్ఈసీ ఈ యాప్ ను విడుదల చేసింది. రాష్ట్రంలోని ఏ పౌరుడైనా ఈ యాప్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చని ఎస్ఈసీ సెక్రెటరీ కన్నబాబు పేర్కొన్నారు.  సర్వీస్ టైం స్టాండర్డ్ ఉంటుందని... ఎలా కంప్లైంట్ ను పరిష్కరించారో కూడా ఉంటుందన్నారు. రేపటి(గురువారం) నుండి ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చని కన్నబాబు తెలిపారు.

 read more  ఈ-వాచ్ యాప్: లిస్ట్ కాని పిటిషన్, విచారణ రేపటికి వాయిదా

రిలయన్స్ ద్వారా పార్టనర్ విధానంలో కాల్ సెంటర్ వినియోగించనున్నట్లు కన్నబాబు పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా కంప్లైంట్ చేస్తే పరిష్కారంపై రెస్పాన్స్ కూడా తీసుకోబడుతుందన్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి చేసే కార్యక్రమాలపై కూడా కంప్లైంట్ ఇవ్వచ్చన్నారు. కంప్లైంట్ 5ఎంబి వీడియో వరకూ అప్లోడ్ చేయచ్చని సూచించారు. డ్యాష్ బోర్డులలో పూర్తి సమాచారం ఉంటుందని... ఎస్ఈసీ, కలెక్టర్  డ్యాష్ బోర్డులలో పూర్తిగా సమాచారం ఉంటుందన్నారు. మత, కుల, సమాజ కంప్లైంట్లు, బ్యాలట్ తొలగించడం వంటివి సీరియస్ కంప్లైంట్లు అని అన్నారు. 
 
 ఈ యాప్ ను భవిష్యత్తులో మరింత బాగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ యాప్ సెక్యూరిటీ ఆడిట్ కూడా ఉంటుందని... కంప్లైంట్ ఏదైనా కాల్ సెంటర్ కు వెళుతుందన్నారు. కాల్ సెంటర్ ఔట్ సోర్స్ ఉద్యోగులపై పర్యవేక్షణ ఈసీ అధికారులే ఉంటారన్నారు. పరిష్కారమైన వాటిమీద రిప్లై కాల్స్ ఉంటాయన్నారు. యాప్ తయారు చేయడానికి తమ ఉద్యోగులే పనిచేసారని... ఖర్చు ఏమీ కాలేదన్నారు. కాల్ సెంటర్ కోసం ఐదు లక్షల ఖర్చు చేస్తున్నట్లు కన్నబాబు వెల్లడించారు.