అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆవిష్కరించిన ఈ -వాచ్‌పై  దాఖలైన పిటిషన్ ను రేపు విచారిస్తామని ఏపీ హైకోర్టు గురువారం నాడు ప్రకటించింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఈ వాచ్ యాప్ ను బుధవారం నాడు ఆవిష్కరించారు.ఈ యాప్ పై ఏపీ ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ యాప్‌ను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

also read:ఈ-వాచ్ యాప్‌పై జగన్ సర్కార్ పిటిషన్: విచారణ జరపనున్న ఏపీ హైకోర్టు

లంచ్ మోషన్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ పై గురువారం నాడు విచారణ నిర్వహిస్తామని బుధవారం నాడు ప్రకటించింది.ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ లిస్ట్ కాకపోవడంతో ఈ పిటిషన్ పై విచారణను శుక్రవారం నాడు చేస్తామని హైకోర్టు తెలిపింది.