ఆంధ్రప్రదేశ్ పంచాయతీలకు తాజాగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో జనసేన మద్దతుదారులు సాధించిన విజయాలను ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. 

ఏపీలో మొత్తం సర్పంచులు 1209, ఉప సర్పంచ్ పదవులు 1576, వార్డులు 4456 గెలిచామని జనసేన పార్టీ వెల్లడించింది. అంతేకాదు మొత్తం మీద 27 శాతం విజయాల్ని సొంతం చేసుకున్నామని తెలిపింది.

అంతేకాదు ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో పార్టీ మద్ధతుదారులు సాధించిన విజయాల్ని లెక్కలతో సహా జనసేన పేర్కింది.