హైదరాబాద్: కృష్ణాబోర్డుకు తెలంగాణపై ఏపీ ఇరిగేషన్ అధికారులు సోమవారం నాడు ఫిర్యాదు చేశారు. విభజన చట్టాన్ని అతిక్రమించి కృష్ణా నదిపై తెలంగాణ అనుమతి లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఫిర్యాదు చేసింది.

కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు అధికారులతో ఏపీ ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు సోమవారం నాడు హైద్రాబాద్ లో సమావేశమయ్యారు. పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంపు విషయమై 203 జీవో జారీపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదుపై బోర్డుకు ఏపీ అధికారులు వివరణ ఇచ్చారు. 

also read:also read:పోతిరెడ్డిపాడు ఎఫెక్ట్: తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదుకు ఏపీ రె'ఢీ'

మరోవైపు తెలంగాణ ప్రభుత్వంపై కూడ ఏపీ అధికారులు ఇవాళ ఫిర్యాదు చేశారు. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం  ఐదు ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టిందని ఏపీ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. 

మిగులు జలాలు ఉన్నాయని ఈ ఐదు ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్టుగా ఫిర్యాదు చేసింది. విభజన చట్టానికి విరుద్దంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టినట్టుగా ఏపీ బోర్డుకు ఫిర్యాదు చేసింది.

also read:పోతిరెడ్డిపై కేసీఆర్ ఎఫెక్ట్: కృష్ణా బోర్డుతో ఏపీ ఇరిగేషన్ అధికారుల భేటీ

ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు అనుమతి లేదని ఈ సందర్భంగా గుర్తు చేసింది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ సమర్పించాలని కేంద్రం కోరినా కూడ ఇంతవరకు డీపీఆర్ సమర్పించలేదని ఏపీ ఆరోపించింది.కృష్ణా జలాల్లో తన వాటాకు మించి తెలంగాణ వాడుకొంటుందని ఏపీ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. 

also read:పోతిరెడ్డిపై కేసీఆర్ ఎఫెక్ట్: కృష్ణా బోర్డుతో ఏపీ ఇరిగేషన్ అధికారుల భేటీ

పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంపును నిరసిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోపై తెలంగాణ ఫిర్యాదు చేసిన మీదట ఏపీ ప్రభుత్వం ఈ ఫిర్యాదు చేసింది. తెలంగాణ కేబినెట్ సమావేశం సాగుతున్న సమయంలోనే ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడం గమనార్హం.