Asianet News TeluguAsianet News Telugu

కాపు రిజర్వేషన్లు: రాజ్యాంగ సవరణపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి: యనమల

కాపు రిజర్వేషన్లపై కేంద్రం రాజ్యాంగ సవరణ చేస్తోందో లేదో చెప్పాలని  ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల విషయమై ఏపీ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

Ap minister Yanamala ramakrishnudu demands to amendment constitution for kapu reservations

అమరావతి:కాపు రిజర్వేషన్లపై కేంద్రం రాజ్యాంగ సవరణ చేస్తోందో లేదో చెప్పాలని  ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల విషయమై ఏపీ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

మంగళవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.  కాపు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి  తాము  చేయాల్సిందంతా చేసి పంపించినట్టు  మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. కాపు రిజర్వేషన్లపై కేంద్రం రాజ్యంగ సవరణ చేయాల్సి ఉందన్నారు.

ఏపీతో పాటు అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్లపై డిమాండ్లు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.   ఈ విషయమై అన్ని రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉందని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు.  

కాపు రిజర్వేషన్ల విషయమై  కేంద్రం ఎందుకు నోరు తెరవడం లేదో చెప్పాలన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాల్సిన ఉన్న విషయం  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు తెలియదా అని ఆయన ప్రశ్నించారు.

ప్రజా సమస్యలపై వైసీపీ, జనసేలు కేంద్రాన్ని నిలదీయాలన్నారు. విభజన హామీల అమలుకు సంబంధించి సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్లు దాఖలు చేయడాన్ని యనమల రామకృష్ణుడు తప్పుబట్టారు. చట్టసభలను తప్పుదోవ పట్టించే విధంగా  కేంద్రం  సుప్రీంకోర్టులో  అఫిడవిట్లను దాఖలు చేసిందని  మంత్రి యనమల అభిప్రాయపడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios