Asianet News TeluguAsianet News Telugu

మొన్న తొడకొట్టారు... నేడు తోకముడిచారు: బాలకృష్ణపై రోజా సెటైర్లు


ఏపీ అసెంబ్లీలో మహిళా సాధికారితపై ఇవాళ జరిగిన చర్చలో ఏపీ మంత్రి రోజా పాల్గొన్నారు.

AP MInister Roja Satirical Comments on  Balakrishna lns
Author
First Published Sep 25, 2023, 5:15 PM IST

అమరావతి:మొన్న ఇదే అసెంబ్లీలో తొడకొట్టి ఇవాళ తోక ముడిచారని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై ఏపీ మంత్రి రోజా సెటైర్లు వేశారు.మహిళా సాధికారితపై  ఏపీ అసెంబ్లీలో సోమవారంనాడు స్వల్పకాలిక చర్చ జరిగింది.ఈ చర్చలో ఏపీ మంత్రి రోజా పాల్గొన్నారు. మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై  చర్చకు సిద్దమా అని ఆమె ప్రశ్నించారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ నాలుగున్నర ఏళ్లలో అమలు చేసిన  పథకాలు... చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో చేశారా అని ఆమె ప్రశ్నించారు.ఈ విషయమై  చర్చకు సిద్దమా అని ఆమె టీడీపీ నేతలకు సవాల్ విసిరారు.మహిళలకు ఏ చిన్న మేలు జరిగినా  సంపూర్ణ మద్దతును ఇస్తున్నారు వైఎస్ జగన్ అని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు ఇవ్వడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.  మహిళా రిజర్వేషన్ బిల్లుకు  టీడీపీ స్వాగతం తెలపకపోవడంపై ఆమె మండిపట్టారు. మహిళల సంక్షేమంపై అసెంబ్లీలో చర్చ జరిగే సమయంలో  అసెంబ్లీలో చర్చకు దూరంగా ఉన్న టీడీపీపై  విమర్శలు చేశారు.టీడీపీని మహిళా ద్రోహుల పార్టీగా ఆమె పేర్కొన్నారు. మహిళల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరిగిన సమయంలో అసెంబ్లీని బహిష్కరించి వెళ్లడం టీడీపీకి అలవాటైందని  రోజా విమర్శలు చేశారు.మహిళల సమస్యలపై చర్చ జరిగే సమయంలో అసెంబ్లీలో లేని టీడీపీని  రాష్ట్రంలోని మహిళలంతా బహిష్కరిస్తారని మంత్రి రోజా చెప్పారు.

జగన్ ను ఇంటికి పంపిస్తానన్న చంద్రబాబు జైలుకు వెళ్లాడని  ఆమె ఎద్దేవా చేశారు. జగన్ కు భయం ఎలా ఉంటుందో పరిచయం చేస్తానన్న లోకేష్ ఢిల్లీకి పారిపోయాడన్నారు.జగన్ కంట్లో భయం ఉండదన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కొట్టే దెబ్బలో తిరుగుడందని   పేర్కొంటూ అర్ధమైందా రాజా అని మంత్రి రోజా  వ్యాఖ్యానించారు.

2024 ఎన్నికల్లో ఉప్పొంగే  సముద్రం మాదిరిగా  జగన్ దెబ్బకి  చంద్రబాబు, లోకేష్, పవన్ కొట్టుకుపోతారన్నారు.  జగనన్న వన్స్ మోర్, టీడీపీ నో మోర్, జనసేన పరార్ అంటూ మంత్రి రోజా  ఎద్దేవా చేశారు.

మహిళా సాధికారిత కోసం నాలుగేళ్లలో జగన్ ఎంతో చేశారని మంత్రి రోజా గుర్తు చేశారు. 40 రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు మహిళల సంక్షేమం కోసం ఏం చేశారని రోజా ప్రశ్నించారు. జగన్ మనసున్న నాయకుడిగా ఆమె పేర్కొన్నారు.మహిళల సంక్షేమం కోసం చేసిన కృషిని చూసి మహిళలంతా  జయహో జగన్ అంటున్నారన్నారు.సీఎంగా ఉన్న 14 ఏళ్లలో మహిళల కోసం ఏం చేశారో చంద్రబాబు చెప్పగలరా అని రోజా ప్రశ్నించారు.ఆడపిల్ల పుట్టుకను చంద్రబాబు ఎగతాళి చేశారని ఏపీ మంత్రి రోజా  విమర్శలు చేశారు.చంద్రబాబు చెప్పేవన్నీ మాయమాటలని మహిళలకు తెలుసున్నారు. టీడీపీ ప్రతిపక్ష పార్టీ కాదు పనికి మాలిన పార్టీ అంటూ ఆమె విమర్శలు చేశారు.భవిష్యత్తుకు  భరోసా అంటూ  రాష్ట్రమంతా మైక్ లు పట్టుకుని ప్రచారం చేసిన చంద్రబాబుకే భవిష్యత్తు లేకుండా పోయిందని ఆమె సెటైర్లు వేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios