Asianet News TeluguAsianet News Telugu

సున్నా.... సున్నా కలిస్తే సున్నానే:టీడీపీ, జనసేన పొత్తుపై అంబటి సెటైర్లు

టీడీపీ, జనసేన పొత్తుపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.చంద్రబాబు పల్లకి మోసేందుకే పవన్ కళ్యాణ్  పార్టీ పెట్టారని ఆయన  విమర్శించారు.

AP Minister Ambati Rambabu Satirical Comments on TDP and Janasena Alliance lns
Author
First Published Oct 23, 2023, 8:46 PM IST | Last Updated Oct 23, 2023, 8:46 PM IST

తాడేపల్లి:సున్నా... సున్నా కలిస్తే సున్నానే అవుతుందని  ఏపీ మంత్రి అంబటి రాంబాబు  టీడీపీ, జనసేన  పొత్తుపై సెటైర్లు వేశారు.టీడీపీ, జనసేన సమన్వయకమిటీ సమావేశంలో సోమవారంనాడు రాజమండ్రిలో జరిగింది.ఈ సమావేశం తర్వాత  సమావేశంలో నిర్ణయాలను  పవన్ కళ్యాణ్, లోకేష్ లు మీడియాకు వివరించారు.వైసీపీపై అరాచకాలపై పోరాటం చేస్తామని ప్రకటించారు. పవన్ కళ్యాణ్, లోకేష్  వ్యాఖ్యలకు  మంత్రి అంబటి రాంబాబు కౌంటరిచ్చారు.

సోమవారంనాడు రాత్రి తాడేపల్లిలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.2014లో టీడీపీకి పవన్ కళ్యాణ్ మద్దతిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.పవన్ కళ్యాణ్ ఓ విధానం ఉందా అని ఆయన ప్రశ్నించారు. అందుకే  పవన్ కళ్యాణ్ ను  ప్యాకేజీ స్టార్ అంటామన్నారు.టీడీపీని భుజానికెత్తుకోవడం తప్ప పవన్ కళ్యాణ్ కు ఓ అజెండా ఉందా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు  మనోధైర్యం కల్పించడం.. లోకేష్ పల్లకి మోయడం కోసమే పవన్ కళ్యాణ్ ఇవాళ రాజమండ్రిలో సమావేశం ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు. వ్యవస్థల గురించి పవన్ కళ్యాణ్ అవగాహన లేదన్నారు.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అన్ని అధారాలున్నందునే  చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని అంబటి రాంబాబు చెప్పారు.చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని  చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.చంద్రబాబు డైరెక్షన్ లో నటించే పవన్ కళ్యాణ్ కు స్వంత ఎజెండా లేదన్నారు.

also read:2024 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం: లోకేష్

అమిత్ షానే తనకు ఫోన్ చేసినట్టుగా  లోకేష్ చెప్పారన్నారు.లోకేష్ పదే పదే ప్రాధేయపడితేనే అమిత్ షా కలిశారని కిషన్ రెడ్డి చెప్పారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని తాము ఎప్పటి నుండో చెబుతున్నామన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జరిగిన అక్రమాల గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని అంబటి అడిగారు.తెలుగుదేశమే తెలుగు రాష్ట్రాలకు తెగులు అని ఆయన పేర్కొన్నారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అంతిమ సంస్కారం చేయనున్నారన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios