చంద్రబాబు సలహాతోనే జీవీఎల్ ఆ పని చేశారు: ఏపీ మంత్రి పేర్ని నాని సంచలనం


చంద్రబాబు సలహాతోనే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన త్రిమెన్ కమిటీలో ప్రత్యేక మోదా అంశాన్ని తొలగించారని ఏపీ మంత్రి పేర్ని నాని విమర్శించారు.

AP  Minister Perni Nani Sensational comments on Special Status

అమరావతి:Chandrababu సలహాతోనే  BJP  ఎంపీ GVL Narasimha Rao ప్రత్యేక హోదా అంశాన్ని త్రిమెన్ కమిటీ నుండి తొలగించారని ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి  Perni Nani ప్రకటించారు. ఆదివారం నాడు మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.Andhra Pradesh, తెలంగాణ రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన త్రీమెన్ కమిటీలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చినప్పుడు చంద్రబాబు మాట్లాడలేదని మంత్రి పేర్ని నాని  గుర్తు చేశారు.

కానీ ప్రత్యేక హోదా అంశం ఎజెండాలో ఉండడంతో  బీజేపీ, TDP నేతలు గోతికాడినక్కల్లా ఎజెండాను మార్పింపజేశారని పేర్ని నాని ఆరోపించారు. ఎజెండాలోSpecial Status  అంశం తొలగించిన తర్వాత టీడీపీ నేతలు మాట్లాడడడాన్ని పేర్ని నాని తప్పుబట్టారు. దీన్నే దయ్యాలు వేదాలు వల్లించడంగా ఆయన పేర్కొన్నారు.ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. ప్రత్యేక హోదాపై బీజేపీ ఇచ్చిన మాటను నిలుపుకొంటుందో లేదా చూడాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం సోము వీర్రాజు, జీవీఎల్ కు ఇష్టం ఉందో లేదో కూడా తేట తెల్లమౌతుందన్నారు.

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలకు సంబంధించి ఓ పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల సీఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులతో విభజన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 17న ఈ కమిటీ సమావేశం కానుంది. అయితే ఈ భేటీకి సంబంధించిన ఎజెండా విషయంలో కేంద్రం ఏపీకి షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఎజెండా నుంచి తొలగించింది కేంద్రం. త్రిసభ్య కమిటీ ఎజెండాలో ఏపీ ప్రత్యేకహోదా, రెవెన్యూ లోటు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పన్నురాయితీలు అనే అంశాలు లేవు. 9 అంశాల నుంచి 5 అంశాలకే ఎజెండాను పరిమితం చేసింది. 

ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల పెండింగ్ అంశాల పరిష్కారానికి శనివారం కేంద్ర హోంమంత్రిత్వశాఖ  త్రీ మెన్ కమిటీని నియమించింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యల మీద కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఫిబ్రవరి 17న ఉదయం 11 గంటలకు కమిటీ తొలి భేటీ  నిర్వహించనున్నారు. హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌కుమార్‌, తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌ లతో కమిటి ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలోనే ఈనెల 17న తొలి భేటీ కావాలని నిర్ణయించినట్లు రెండు రాష్ట్రాల అధికారులకు కేంద్ర హోం శాఖ సమాచారం పంపింది. ఈనెల 8న పంపిన సమాచారంలో మధ్యాహ్నం 3.30గం.లకు భేటీ కావాలని నిర్ణయించినా... తరువాత భేటీ సమయాన్ని హోం శాఖ అధికారులు 11గం.లకు మార్చారు. ఈ త్రిసభ్య కమిటి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భేటీ కానుంది. షెడ్యూల్‌ 9, 10లలో ఉన్న సంస్థల విభజన, ఆస్తుల పంపకాలు, ఇటీవల రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశాలపై కూడా చర్చించనుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios