Asianet News TeluguAsianet News Telugu

రూ.100 టికెట్ రూ. 2 వేలకు అమ్మాలని ఏ చట్టం చెప్పింది: రామ్‌గోపాల్‌వర్మకు మంత్రి పేర్ని నాని కౌంటర్

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సినిమా టికెట్ల ధరల తగ్గింపు విషయంలో లేవనెత్తిన ప్రశ్నలపై ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు.

AP Minister Perni Nani Counter To Director Ram Gopal Varma
Author
Guntur, First Published Jan 5, 2022, 9:21 AM IST

అమరావతి: ప్రముఖ దర్శకుడు Ramgopal Varma లేవనెత్తిన ప్రశ్నలకు ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి Perni Nani  కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రశ్నల వర్షం కురిపించారు. Cinema  Tickets ధరల తగ్గింపును తప్పుబట్టారు. ఈ విషయమై 10 ప్రశ్నలతో కూడిన వీడియోను ఏపీ మంత్రి పేర్నినానికి సంధించారు.  మీ ప్రభుత్వానికి అధికారం ఇస్తే మా తలపై ఎక్కి కూర్చోకండి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ పది ప్రశ్నలను రామ్ గోపాల్ సంధించారు.
రామ్‌గోపాల్ వర్మకు మంత్రి పేర్ని నాని ట్విట్టర్ వేదికగానే కౌంటర్ ఇచ్చారు. Twitter వేదికగా మీరు చేసిన ట్వీట్లను తాను చూసినట్టుగా ఏపీ రాష్ట్ర మంత్రి పేర్ని నాని ప్రకటించారు.

 

రూ. 100 ల టికెట్ ను రూ. 1000, రూ.2000లకు అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయి, ఏ చట్టం చెప్పిందని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారని నాని వర్మను అడిగారు. డిమాండ్, సప్లయ్ అంటారా లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా చెప్పాలన్నారు.

also read:AP Tickets Prices: టికెట్స్ ధరల వివాదం... ఏపీ ప్రభుత్వాన్ని మరోసారి ఉతికిపారేసిన వర్మ

సామాన్యుడి మోజుని, అభిమానాన్ని లూటీ చేసే పరిస్ధితి లేకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్లుగా చట్టాలకు లోబే సినిమా టికెట్ ధరలను నిర్ణయిస్తున్నాయని మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు.

ఉప్పూ, పప్పూ లాంటి నిత్యావసర వస్తువుల ధరల్ని మాత్రమే  ప్రభుత్వం నియంత్రించవచ్చుగానీ, సినిమా టికెట్ల ధరల్ని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని రామ్‌గోపాల్ వర్మ ప్రశ్నను మంత్రి ప్రస్తావించారు. ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు సినిమా థియేటర్లు అంటూ మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు.బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్ పోతుందని ఎకనామిక్స్ లో  ప్రాథమిక సూత్రం అని ఎవరు చెప్పారని మంత్రి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను ప్రశ్నించారు.

మీరూ ఎంతవరకు నిర్మాతల శ్రేయస్సు గురించే మాట్లాడుతూ వినియోగదారుల యాంగిల్‌ను గాలికి వదిలేశారని ఆయన ప్రశ్నించారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండంటూ మంత్రి పేర్ని నాని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు చురకలు అంటించారు.

సినిమాను అత్యవసర సర్వీసుగా  భావిస్తుంటే మెడికల్, ఎడ్యుకేషన్ మాదిరిగానే  తమ ప్రభుత్వం  భరించాలని అడిగారు. సినిమాను తాము నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించడం లేదని మంత్రి పేర్ని నాని తేల్చి చెప్పారు.

సినిమా థియేటర్లలో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగానే నిర్ణయించాలని 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెబుతున్నాయని మంత్రి పేర్ని నాని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు సూచించారు.

హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్ కి ఒక ఫార్మూలా చెప్పారు. మీరు ఏ హీరోకు  ఎంత ఇస్తారు, ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకొని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్రప్రభుత్వం నిర్ణయిందని మంత్రి నానిత దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు తెలిపారు.

ఒక వస్తువుకు సంబంధించిన మార్కెట్ ధర నిర్ణయించడంలో అసలు ప్రభుత్వానికి ఉన్న పాత్ర ఏమిటో సమాధానం ఇవ్వాలని వర్మ వేసిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.  సినిమా ఒక వస్తువు కాదు అది వినోద సేవ మాత్రమేనని చెప్పారు మంత్రి నాని.అది వినోద సేవ మాత్రమేనన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సినిమా థియేటర్లలో టికెట్ ధరల నియంత్రణ మాత్రమే తప్ప సినిమా నిర్మాణ నియంత్ర ముమ్మూటికి కాదన్నారు.

అధికారాన్ని కట్టబెడితే మా నెత్తిన ఎక్కి తొక్కడానికి కాదని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలకు కూడా మంత్రి పేర్ని నాని అదే స్థాయిల్ కౌంటర్ ఇచ్చారు. సినిమా టికెట్ ను ఎంతకైనా అమ్ముకోనిస్తే పరిశ్రమకు కింది నుండి బలాన్ని ఇచ్చినట్టా అని మంత్రి ప్రశ్నించారు. సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు మీరు ప్రవచించం సబబేనా అంటూ వర్మను ప్రశ్నించారు మంత్రి పేర్నినాని.
 

Follow Us:
Download App:
  • android
  • ios